గోవును అడ్డం పెట్టుకుని జగన్ రాజకీయం చేస్తున్నారు: అచ్చెన్నాయుడు

గోవును అడ్డం పెట్టుకుని సీఎం జగన్ రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఓ వైపు రథాలు తగలబెట్టి, మరోవైపు విగ్రహాలను ధ్వంసం చేయించి ఇప్పుడు పూజల్లో పాల్గొంటున్నారని ఎద్దేవా చేశారు. సీఎం చేస్తున్న దిగజారుడు రాజకీయాలకు ఇది నిదర్శనమని ఆయన అన్నారు. బాబాయి హత్యపై చలించని వ్యక్తి దేవుళ్లపై విశ్వాసం చూపుతాడనేది భ్రమ అని అన్నారు.

రాబోయే రోజుల్లో ఏ మతంపై దాడులు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. మతాల మధ్య మంట పెట్టి చలికాచుకునే విధానం వైసీపీకి ఉందని.. ఆ విధానానికి స్వస్తి పలకాలన్నారు. రధం దగ్దమైనప్పుడే తాము ప్రభుత్వానికి సూచించినా పట్టించుకోలేదని దుయ్యబట్టారు. నిందితులను పట్టుకోవడం చేతకాని ప్రభుత్వం రాష్టానికి అవసరమా..? అంటూ అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. జగన్ ఏ మతాన్నీ ప్రశాంతంగా ఉండనివ్వరని క్రిష్టియన్లకు క్రిస్మస్, ముస్లింలకు రంజాన్, హిందువులకు సంక్రాంతి కానుకలు దూరం చేశారంటూ మండిపడ్డారు.


Recent Random Post: