మెహబూబ్‌ సీక్రెట్‌ రివీల్ చేసిన సోహెల్‌

తెలుగు బిగ్‌ బాస్ సీజన్‌ 4 తో మెహబూబ్‌ మరియు సోహెల్‌ మంచి గుర్తింపు దక్కించుకున్న వారు. వీరిద్దరు కూడా షో తర్వాత సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ గా అభిమానులతో టచ్‌ లో ఉంటున్నారు. మెహబూబ్‌ యూట్యూబ్‌ వీడియోలతో రచ్చ చేస్తుంటే సోహెల్‌ మాత్రం సినిమాలతో బిజీ అయ్యాడు. షూటింగ్‌ లతో బిజీగా ఉన్నా కూడా సోహెల్‌ అప్పుడప్పుడు సోషల్‌ మీడియాలో కనిపిస్తూ సందడి చేస్తున్నాడు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ లో అభిమానులతో చిట్‌ చాట్‌ చేసిన సోహెల్‌ తన స్నేహితులు అయిన మెహబూబ్‌ మరియు అఖిల్‌ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

మెహబూబ్ మరియు అఖిల్‌ లు వీడియోలో అందంగా కనిపించడానికి కారణం వారు ఫిల్టర్ లు వాడుతారు. అరే మెహబూబ్‌ ఆ ఫిల్టర్‌ లు ఎలా వాడాలో నాకు చెప్పండి. నేను కూడా మీలా తెల్లగా కనిపించాలి కదా అంటూ సరదాగా వ్యాఖ్యలు చేశాడు. ఈమద్య కాలంలో మెహబూబ్‌ వీడియోలో తెగ ట్రెండ్డింగ్ లో ఉంటున్నాయి. ఆయన ఏం చేసినా కూడా సందడి సందడిగా ఉంటాయని అభిమానులు అంటూ ఉంటారు. ఇక అఖిల్‌ కూడా బిగ్‌ బాస్ తర్వాత బిజీ అయ్యాడు.


Recent Random Post: