గోషామహల్ ఎమ్మెల్యే బీజేపీ నేత రాజాసింగ్ కు నాంపల్లి కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. ఈమేరకు ప్రత్యేక న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. బీఫ్ ఫెస్టివల్ వివాదంలో రాజాసింగ్‌పై ఐదేళ్ల క్రితం బొల్లారం పోలిస్ స్టేషన్ లో కేసు నమోదయింది. ఈ వ్యవహారంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఆ సమయంలో ఉస్మానియా యూనివర్శిటీలో బీఫ్ ఫెస్టివల్‌ను రాజాసింగ్ అడ్డుకునే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారని ఆయనపై కేసు నమోదు అయింది. విచారించిన కోర్టు ఈరోజు రాజాసింగ్ కు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఆ వెంటనే రాజాసింగ్ బెయిల్ కోసం అప్పీల్ చేసుకోగా ఆయనకు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. దీనిపై అప్పీల్ చేసుకునే అవకాశం కూడా కల్పించింది.
Recent Random Post: