లాంగ్‌ డ్రైవ్‌ కు వెళ్లిన బిబి4 టామ్‌ అండ్‌ జెర్రీ

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 ద్వారా గుర్తింపు దక్కించుకున్న సోహెల్‌ మరియు అరియానాలు వారి వారి కెరీర్ లో బిజీ అయ్యారు. షో నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా ఇద్దరు హడావుడి చేశారు. ఇద్దరు మంచి స్నేహితులుగా మారిపోయారు. షో లో ఉన్న సమయంలో చాలా సార్లు గొడవ పడ్డ ఈ టామ్‌ అండ్ జెర్రీ బయటకు వచ్చిన తర్వాత చాలా క్లోజ్ ఫ్రెండ్స్ గా మెలుగుతున్నారు. ఇద్దరు కూడా పదే పదే కలవడం జరుగుతుంది. తాజాగా వీరిద్దరు మరోసారి కలిశారు.

అరియానా మరియు సోహెల్‌ కలిసి లాంగ్ డ్రైవ్‌ కు వెళ్లారు. ఆ విషయాన్ని స్వయంగా వారే వీడియో లో చెప్పారు. చాలా రోజులుగా ఇద్దరం కలిసి ట్రిప్ అనుకుంటున్నాం. కాని అరియానా అరోగ్యం సరిగా లేకపోవడం వల్ల ఆగిపోయాం. మళ్లీ ఇద్దరం కలిసి ఇన్నాళ్లకు ఇలా వెళ్లడం సంతోషంగా ఉందని అరియానా కూడా అంది. బిగ్‌ బాస్ తర్వాత మొదటి సారి ఇలా పర్సనల్‌ గా కలిశాం అంటూ అరియానా చెప్పుకొచ్చింది.


Recent Random Post: