యూనిర్శిల్ స్టార్ కమల్ హాసన్ నటుడిగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. నటుడు అయిన కమల్ ను అంతా నెత్తిన పెట్టుకున్నారు. కాని ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రాజకీయాల్లో ఆయన ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటున్నారు. అయినా కూడా ఆయన్ను కొందరు ఘాటు విమర్శలు చేస్తూ దోషిగా నిలబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలోనే కమల్ పై ఆయన మాజీ జీవిత భాగస్వామి అయిన గౌతమి కూడా విమర్శలు చేశారు.
గౌతమి తో సుదీర్ఘ కాలం పాటు సహ జీవనం సాగించిన కమల్ హాసన్ కొన్నాళ్ల క్రితం ఆమె నుండి దూరం అయ్యాడు. ఆమెను మళ్లీ సన్నిహితంగా చేసుకునేందుకు ప్రయత్నించాడు అని టాక్ వచ్చింది. కాని గౌతమ్ మళ్లీ కమల్ వైపు వెళ్లలేదు. ప్రస్తుతం బీజేపీలో గౌతమి కొనసాగుతున్నారు. ఆమె అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా ప్రచారం నిర్వహించారు. ఆ సమయంలో కమల్ ప్రజలను మోసం చేసే విధంగా హామీలు ఇస్తూ మార్కెటింగ్ ట్రిక్స్ ను ఉపయోగించి ఓట్లు రాబట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ ఆరోపించింది. కమల్ రాజకీయాల్లో మార్పు తీసుకు రావాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. కాని అది ఆయన వల్ల కాకపోవచ్చు అంటూ గౌతమి అభిప్రాయం వ్యక్తం చేసింది.
Recent Random Post: