వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు సంచలనం రేపారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీఎం జగన్ 11 సీబీఐ ఛార్జిషీట్లలో ఏ-1గా ఉన్నారని రఘురామ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తాను రాజ్యాంగంపై ప్రమాణం చేసానని.. తమ పార్టీకి చెడ్డ పేరు రాకుండా చూడాలనే ఉద్దేశంలో ఈ పిటిషన్ వేసినట్టు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు.
‘జగన్ త్వరగా కేసుల నుంచి బటయపడాలనే ఈ కేసు వేశాను. త్వరగా కేసు తేలిపోతుందనే నమ్ముతున్నాను. ప్రత్యర్థులకు ఛాన్స్ ఇవ్వకూడదనే హైకోర్టు తలుపుతట్టాను. ఇన్ని ఛార్జిషీట్లు వేసినా… కేసుల విచారణలో జాప్యం జరుగుతోంది. కోర్టుకు వెళ్లకపోవడంపై పలు అనుమానాలు ఉన్నాయి. పార్టీకి చెందిన వ్యక్తిగా ప్రజాస్వామ్యాన్ని, పార్టీని రక్షించుకోవాలి. జయలలిత, లాలూ.. తమ స్థానంలో వేరొకరిని సీఎంగా ఛాన్స్ ఇచ్చినట్టే జగన్ కూడా వేరొకరికి అవకాశమిచ్చి కేసుల నుంచి బయటపడాలని కోరుకుంటున్నా’ని అన్నారు.
Recent Random Post: