కొన్నిరోజులుగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వరుసగా లేఖలు రాస్తున్న వైసీపీ రెబల్ ఎంపీ నేడు మరో లేఖ రాశారు. ఈ లేఖలో రైతు భరోసా అంశాన్ని ప్రస్తావించారు. ఇది ఆయన రాసిన ఏడో లేఖ. ఇందులో ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రైతుభరోసా సాయాన్ని అందించాలని కోరారు. ఎన్నికల్లో పెద్ద ఎత్తున రైతులు వైసీపీకి అండగా నిలిచారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6వేలతోపాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున 13,500 ఇవ్వాలని కోరారు. కేంద్ర సాయంతో కలిపి మొత్తం 19,500 రైతులకు అందించాలని లేఖలో కోరారు.
Posted inTelugu - Featured Telugu - Political News
