రఘురామకు స్పీకర్‌ అనర్హత నోటీసులు

అధికార పార్టీ వైకాపా రెబల్ ఎంపీ అయిన రఘురామ కృష్ణ రాజు పై అనర్హత వేటు వేయాల్సిందే అంటూ ఆ పార్టీ ఎంపీలు స్పీకర్‌ ఓమ్‌ బిర్లాకు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. అయినా కూడా రఘురామ రామపై ఇన్నాళ్లు ఎలాంటి చర్యలు లేవు. కాని ఇటీవల మళ్లీ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో స్పీకర్‌ కార్యాలయం వారు రఘురామకు నోటీసులు ఇవ్వడం జరిగింది. అనర్హత ఎందుకు వేయకూడదో తెలియజేయాలంటూ నోటీసుల్లో పేర్కొనడంతో పాటు 15 రోజుల గడువు ఇస్తున్నట్లుగా కూడా పేర్కొన్నారు. మొత్తానికి ఈ విషయం కాస్త హాట్‌ గా మారిందని రాజకీయ వర్గాల వారు అంటున్నారు.

రఘురామ వైకాపా నుండి గెలిచి ఆ పార్టీ పైనే రెగ్యులర్ గా విమర్శలు సంధిస్తూ వస్తున్నాడు. వరుసగా ఆయన సీఎం జగన్‌ పై చేస్తున్న సంచలన వ్యాఖ్యల వల్ల వైకాపా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అందుకే రఘురామ పై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్‌ ను వైకాపా ఎంపీలు కోరుతున్నారు. రఘురామ మాత్రం తనపై అనర్హత వేటు వేయడం అసాధ్యం అంటున్నాడు. ఆయన వైకాపాపై తన విమర్శలు మాత్రం అస్సలు ఆపడటం లేదు. ఈ వివాదం ఎక్కడికి వెళ్తుందా అంటూ రాజకీయ వర్గాల వారు ఆసక్తిగా చూస్తున్నారు.


Recent Random Post: