జైలులో తీన్మార్ మల్లన్న ఆమరణ దీక్ష..! నిజమేనా..?

ఓ కేసులో చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న తీన్మార్‌ మల్లన్న మంగళవారం సాయంత్రం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారనే వార్త సోషల్‌ మీడియాలో వైరల్ అయింది. బుధవారం ఉదయం తీన్మార్‌ మల్లన్న ఆన్‌లైన్‌ ములాఖత్‌లో భార్యతో మాట్లాడారు. ఆసమయంలో పోలీసుల అక్రమ కేసులకు నిరసనగా నిరాహార దీక్ష చేస్తున్నట్లు భార్యతో చెప్పినట్లు వార్తలు వచ్చాయి.

దీనిపై జైలు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ డి.శ్రీనివాస్‌ వివరణ ఇచ్చారు. తీన్మార్ మల్లన్న జైలులో నిరాహార దీక్ష చేస్తున్నారనే వార్త అవాస్తవం అని అన్నారు. జగద్ గిరిగుట్ట పోలీ‌స్‌స్టేషన్‌ పరిధిలో గతంలో తీన్మార్‌ మల్లన్నపై కేసు నమోదైంది. ఈనేపథ్యంలో బుధవారం వెబనార్‌ ద్వారా పోలీసులు ఆయనను విచారించారు. కూన మహాలక్ష్మీనగర్‌కు చెందిన వెంకటేశ్‌ అనే వ్యక్తికి గతంలో ఓ ప్లాట్‌ విషయంలో కార్పొరేటర్‌ జగన్‌ అనుచరుడు సంపత్‌రెడ్డికి మధ్య గొడవ జరిగింది. ఈవిషయంపై కార్పొరేటర్‌ వద్దకు వెంకటేశ్‌ వెళ్లినా న్యాయం జరగలేదు.

దీంతో వెంకటేష్ తీన్మార్‌ మల్లన్నను సంప్రదించాడు. ఈవిషయంలో సంపత్‌రెడ్డికి తీన్మార్‌ మల్లన్నకు మధ్య వాగ్వివాదం జరిగింది. ఈక్రమంలో సంపత్‌రెడ్డి తీన్మార్‌ మల్లన్నపై కోర్టు ద్వారా కేసు వేశాడు.


Recent Random Post: