ఒక బాధ్యత కలిగిన తండ్రి తన కొడుకు తప్పుడు దారిలో వెళ్తున్న సమయంలో సరి చేయాల్సి ఉంటుంది. అలా కాదని సరి చేకుంటే మొదట చిన్న తప్పులు చేసిన వారు ఆ తర్వాత తర్వాత పెద్ద తప్పులు చేస్తారు. డ్రగ్స్ సిగరెట్ డ్రింక్ అలవాటు ఉన్నట్లుగా తెలిసిన సమయంలోనే డ్రగ్స్ తో దూరంగా ఉండాలని షారుఖ్ చెప్పి ఉంటే బాగుండేది. అలా చెప్పక పోవడం వల్లే ఇప్పడు షారుఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయ్యాడు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
కొన్నాళ్ల క్రితం ఆర్యన్ ఇంకా తన పిల్లల గురించి షారుఖ్ ఖాన్ స్పందిస్తూ తన కొడుకు అన్ని విషయాలను ఆస్వాదించాలి. డ్రగ్స్.. సెక్స్.. డ్రింక్ అన్నింటిని ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాడు. అతడు ఎంజాయ్ చేసేంత వరకు చేస్తాడని.. అతడికి హద్దులు పరిమితులు తెలుస్తాయని తాను ఆశిస్తున్నాను అంటూ ఆ సందర్బంగా షారుఖ్ చెప్పుకొచ్చాడు. అంతగా కొడుకు గురించి చెప్పడం వల్లే ఆర్యన్ తప్పుడు దారిలో పడ్డాడు అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. మొత్తానికి షారుఖ్ తప్పుడు నిర్ణయాలు కొడుకు జీవితాన్ని నాశనం చేస్తున్నాయని అంటున్నారు.
Recent Random Post: