టీడీపీ ఎమ్మెల్యే గంటా ధైర్యమేంటి.? వైసీపీ భయం దేనికి.?

టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చాలాకాలంగా సొంత పార్టీ కార్యక్రమాల్లో కనిపించడంలేదు. కొన్నాళ్ళ క్రితం ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాను ఆమోదించాలని పలుమార్లు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంని కోరారు కూడా. ఇటీవల అసెంబ్లీ సమావేశాల సమయంలో కూడా గంటా, తన రాజీనామాను ఆమోదించాలని తమ్మినేనిని కోరారట.

మామూలుగా అయితే, అధికార వైసీపీకి ఇదొక అద్భుతమైన అవకాశం. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో గెలిచినట్లు.. కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో సత్తా చాటినట్లు, గంటా రాజీనామాతో ఖాళీ అయ్యే విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి వైసీపీ గెలిచేయొచ్చు. కానీ, ఎందుకో గంటా రాజీనామా విషయంలో వైసీపీ ఒకింత భయపడుతోంది.

టీడీపీ నుంచి కొందరు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయకుండానే వైసీపీలో చేరిపోయారు. జనసేన పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యేదీ ఇదే దారి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై క్షణం ఆలస్యం చేయకుండా అనర్హత వేటు వేస్తామని గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పారుగానీ.. మాట మీద నిలబడటం ఆయనకు అలవాటు లేదనుకోండి.. అది వేరే సంగతి.

నిజానికి, వైసీపీకి అసెంబ్లీలో పూర్తి బలం వుంది.. అయినా, విపక్షాల్ని నిర్వీర్యం చేసే క్రమంలో ఆపరేషన్ ఆకర్షకు తెరలేపింది. గంటా శ్రీనివాసరావు విషయంలోనూ అలాంటిదే జరిగిందా.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. గంటా వైసీపీలోకి వెళ్ళేందుకు ప్రయత్నించినా, మంత్రి అవంతి శ్రీనివాస్ కారణంగా ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు.

పోనీ, గంటా రాజీనామాను స్పీకర్ ఆమోదించొచ్చు కదా.? అంటే, అందుకు వైసీపీ అధిష్టానం సుముఖత వ్యక్తం చేయడంలేదట. అద్గదీ అసలు సంగతి. గంటా విషయంలో వైసీపీకి భయమెందుకు.? అంటే, అదొక సమాధానం దొరకని ప్రశ్నగా మారిపోయింది.


Recent Random Post: