జూన్ 10న జరుగనున్న రాజ్యసభ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ తన అభ్యర్ధులను ప్రకటించింది. అయితే.. కీలక నేతల్ని పక్కనపెట్టడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పార్టీ నాయకురాలు, కాంగ్రెస్ ముంబై యూనిట్ వైస్ ప్రెసిడెంట్, నటి నగ్మా ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు.
టికెట్ దక్కని పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా.. మొదట విమర్శించారు. ‘నేను చేసిన తపస్సులో ఏదో తప్పు ఉన్నట్టుంది’ అని ట్వీట్ చేశారు. ఇదే ట్వీట్ కు నగ్మా స్పందిస్తూ.. ’18 ఏళ్ల నా తపస్సులో కూడా ఏదో లోపముంది. అందుకే ఇమ్రాన్ ప్రతిగర్హిని ఎంపిక చేశారు. 2003-04లో కాంగ్రెస్ లో చేరినప్పుడు తనకు రాజ్యసభ సీటు ఇస్తానని స్వయంగా సోనియా గాంధీనే హామీ ఇచ్చారు. అయితే.. ఇన్నాళ్లలో పట్టించుకోలేదు. ఇప్పుడు మహారాష్ట్ర నుంచి ఇమ్రాన్ భాయ్ ని ఎంపిక చేశారు. ఆ పదవికి నేను అర్హురాలిని కాదా..?’ అని ప్రశ్నించారు. దేశంలోని 15 రాష్ట్రాల్లో 57 రాజ్యసభ స్థానాలకు జూన్ 10ప ఎన్నికలు జరుగనున్నాయి.
Recent Random Post: