రేపే ముహూర్తం..! నడ్డా సమక్షంలో బీజేపీలోకి ఈటల రాజేందర్

Share

ఆమధ్య మంత్రివర్గం నుంచి బహిష్కరణకు గురైన ఈటల రాజేందర్.. ఇటివలే ఎమ్మెల్యే పదవికి టీఆర్ఎస్ కి కూడా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఆయన రేపు బీజేపీలో చేరనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో రేపు ఉదయం 11:30కి కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఈక్రమంలో ఆయన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తో కలిసి రేపు ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లనున్నారు.

వీరి వెంట మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, మాజీ ఛైర్మన్‌ తుల ఉమ కూడా వెళ్లనున్నట్టు తెలుస్తోంది. వీరు కూడా బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈటలపై భూకబ్జా, దేవరయాంజల్‌ భూ కుంభకోణం ఆరోపణలు ఉన్నాయి. ఈటల రాజీనామా నేపథ్యంలో హుజూరాబాద్ కు రాబోయే ఉప ఎన్నికపై ఇప్పటి నుంచే దృష్టి సారిస్తున్నారు. ఉప ఎన్నికల్లో హుజురాబాద్ నుంచి ఈటల రాజేందర్ భార్య జమున పోటీ చేస్తారనే ఊహాగానాలు వస్తున్నాయి.


Recent Random Post: