కోర్టును ఆశ్రయించిన ఈటెల ఫ్యామిలీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈటెల రాజేందర్‌ మరియు ఆయన కుటుంబ సభ్యులు భూ ఆక్రమణలకు పాల్పడ్డారు అంటూ నిర్థారణ అయ్యిందని చర్యలు తీసుకుంటున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఈటెలను మంత్రి పదవి నుండి బర్తరఫ్‌ చేయడంతో పాటు ఆయన కుటుంబం పై కేసులు నమోదు చేయడం జరిగింది. ఆయన భార్య మరియు కొడుకులపై పెట్టిన కేసులు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేసింది అంటూ ఈటెల భార్య మరియు కుమారుడు కోర్టును ఆశ్రయించారు.

హైకోర్టులో జమున మరియు ఆమె కుమారుడు తమ భూమిలో అక్రమంగా సర్వే చేసి ప్రభుత్వ భూములుగా బోర్డులు ఏర్పాటు చేశారంటూ పిటీషన్ దాఖలు చేయడం జరిగింది. తమ భూముల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవద్దని ఆదేశించడంతో పాటు బలవంతపు చర్యలు తీసుకోకుండా మెదక్‌ జిల్లా కలెక్టర్‌ ను ఆదేశించాలంటూ కోర్టును వేడుకోవడం జరిగింది. కోర్టు ఈ విషయమై ఎలాంటి మద్యంతర ఉత్తర్వులు ఇస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.


Recent Random Post: