ఐఏఎస్ శ్రీలక్ష్మికి అరెస్ట్‌ వారెంట్‌ జారీ

తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితురాలు అయిన ఐఏఎస్ శ్రీలక్ష్మి పై అరెస్ట్‌ వారెంట్ జారీ అయ్యింది. గత కొన్నాళ్లుగా ఈమె జగన్ అక్రమాస్తుల కేసులో నింధితురాలుగా ఉన్న విషయం తెల్సిందే. ఆ కేసులో ఆమె జైలుకు కూడా వెళ్లి వచ్చారు. మళ్లీ ఐఏఎస్ గా విధులు నిర్వహిస్తున్న ఆమె ఇటీవల వరుసగా జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించిన కేసు విచారణకు కోర్టుకు హాజరు అవ్వలేదు. కోర్టుకు హాజరు కాకుంటే ఎవరికి అయినా నాన్ బెయిలబుల్ అరెస్ట్‌ వారెంట్‌ జారీ అవుతుంది. అలాగే శ్రీలక్ష్మి పై కూడా అరెస్ట్‌ వారెంట్‌ ను జారీ చేయడం జరిగింది.

వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని కొన్నాళ్లుగా ఆమె విజ్ఞప్తి చేస్తున్నారు. కాని కోర్టు మాత్రం ఆమె వ్యక్తిగత హాజరు తప్పనిసరి అంటూ పేర్కొంది. అరెస్ట్‌ వారెంట్‌ జారీ అయిన నేపథ్యంలో ఆమె వెంటనే కోర్టులో లొంగి పోవాల్సి ఉంటుంది. ఈ కేసు విషయమై గతంలో కూడా శ్రీలక్ష్మి పలు సమస్యలు ఎదుర్కొన్నారు.. జైలుకు వెళ్లారు. ఇప్పుడు మళ్లీ జైలుకు వెళ్లాల్సి రావచ్చు అంటూ న్యాయ నిపుణులు చెబుతున్నారు. కోర్టు విచారణ కోసం ప్రతి సారి హైదరాబాద్ వెళ్లడం ఇబ్బంది గా ఉంది అనేది శ్రీలక్ష్మి వాదన. ఈ కేసులో తన పేరును తొలగించాలని.. తనను వ్యక్తిగత హాజరు నుండి మినహాయించాలని పలు పిటీషన్ లను ఆమె వేశారు. అయినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది.


Recent Random Post: