తనకు న్యాయం చేయాలంటున్న జబర్దస్త్ వినోద్

జబర్దస్త్ లో ఎక్కువగా లేడీ పాత్రలతో ఫేమ్ సంపాదించుకున్న వినోద్, తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. ఈ నేపథ్యంలో ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్ రెడ్డిని కలిసిన వినోద్ వినతిపత్రం అందజేశాడు. తనకు ఇంటి విషయంలో న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటున్నట్లు తెలిపాడు.

“ప్రస్తుతం తాను నివాసం ఉంటున్న అద్దె ఇంటిని 40 లక్షల రూపాయలకు విక్రయిస్తానని తెలిపాడు యజమాని. ఈ మేరకు అగ్రిమెంట్ కూడా జరిగింది. అలాగే ఏడాది క్రితం 13.40 లక్షలను అడ్వాన్స్ గా తీసుకున్నాడు. అయితే ఇప్పుడేమో 40 లక్షలకు మించి ఇస్తేనే ఇల్లును విక్రయిస్తానని అంటున్నాడు. అడ్వాన్స్ గా ఇచ్చిన డబ్బును కూడా వెనక్కి తిరిగి ఇవ్వనని చెబుతున్నాడు. గతంలో నాపై దాడి కూడా చేసారు. కాచిగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా కూడా ఫలితం లేదు. మీరే నాకు న్యాయం చేయాలి” అని డీసీపీకి అందజేసిన వినతిపత్రంలో వినోద్ పేర్కొన్నాడు.


Recent Random Post: