జబర్దస్త్‌ కమెడియన్‌ పై కేసు నమోదు

జబర్దస్త్‌ లో కెవ్వు కార్తీక్‌ పేరుతో బాగా ఫేమస్‌ అయిన కమెడియన్‌ కార్తీక్‌ పై గూడూరు పోలీస్‌ స్టేషన్‌ లో కేసు నమోదు అయ్యింది. ఈ కేసును స్వయంగా ఆయన సోదరి భర్త పెట్టడం చర్చనీయాంశం అయ్యింది. ఇటీవల కార్తీక్‌ మరియు అతడి స్నేహితులు కుటుంబ సభ్యులు కలిసి తనపై దాడి చేశారంటూ కార్తీక్‌ కేసు పెట్టాడు. కారులో బలవంతంగా ఎక్కించుకుని 15 కిలో మీటర్లు తీసుకు వెళ్లి అక్కడి వరకు కొడుతూనే వచ్చారు అంటూ బాధితుడు రవి కుమార్‌ పోలీసులకు తెలియజేశాడు.

కార్తీక్‌ సోదరిని రవి కుమార్‌ కొన్నాళ్లుగా హింసిస్తున్నాడు అనేది మరో వాదన. తన సోదరిని హింసిస్తున్నందుకు గాను అడికి వార్నింగ్‌ ఇచ్చే ఉద్దేశ్యంతో కార్తీక్‌ ఈ పని చేసి ఉంటాడేమో అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కార్తీక్‌ తో పాటు అతడి తల్లిదండ్రులు మరియు కార్తీక్‌ వెంట వచ్చిన అయిదుగురుపై కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. వారం రోజుల్లో కార్తీక్‌ గూడూరు పోలీస్‌ స్టేషన్‌ లో సరెండర్‌ అవ్వాల్సి ఉంటుంది. లేదంటే అతడిని అరెస్ట్‌ చేస్తామని పోలీసులు పేర్కొన్నారు.


Recent Random Post: