అఖండ ఐటెం క్లారిటీ వచ్చింది

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న అఖండ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. పెద్ద ఎత్తన అంచనాలున్న ఈ సినిమా చిత్రీకరణ పునః ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఐటెం సాంగ్ చిత్రీకరణ మొదలు పెట్టబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ సినిమా లో ఐటెం సాంగ్‌ ను ఏ హీరోయిన్ చేయబోతుందనే విషయమై చాలా రోజుల పాటు వార్తలు వచ్చాయి. చివరకు ఖైదీ నెం.150 సినిమా లో ఐటెం సాంగ్‌ చేసిన రత్తాలు రాయ్ లక్ష్మిని ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.

బాలకృష్ణ గతంతలో నటించిన అధినాయకుడు సినిమా లో హీరోయిన్ గా రాయ్‌ లక్ష్మి నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమా నిరాశ పర్చింది. అయినా కూడా మళ్లీ ఈ సినిమా తో ఆమెకు ఆఫర్ ఇచ్చాడు. రాయ్‌ లక్ష్మి ఈమద్య కాలంలో వరుసగా ఐటెం సాంగ్స్ ను చేస్తున్న విషయం తెల్సిందే. ఆమె ఐటెం సాంగ్స్ కు మంచి స్పందన వస్తుంది. కనుక ఐటెం సాంగ్‌ తో అఖండలో ఆమెను మెరిపించేందుకు బోయపాటి సిద్దం అయ్యాడని వార్తలు వస్తున్నాయి. త్వరలో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


Recent Random Post: