పశ్చిమ బెంగాల్ లో మూడవ సారి సీఎంగా టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె ప్రమాణ స్వీకారం సింపుల్ గా కొద్ది మంది సమక్షంలో జరిగింది. మమతా బెనర్జీతో గవర్నర్ జగ్దీప్ ధన్కడ్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆదివారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మమత పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. అయితే ఆమె పోటీ చేసిన నందిగ్రామ్లో మాత్రం ఓడిపోవడంతో సీఎంగా ఆమె ప్రమాణ స్వీకారం చేస్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
మమత బెనర్జీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అర్హురాలు కాదు అంటూ బీజేపీ నాయకులు విమర్శలు చేశారు. వాటిని పట్టించుకోకుండా తానే సీఎంగా మమత ప్రమాన స్వీకారం చేశారు. ఆరు నెలల్లో మండలి లేదా అసెంబ్లీ నుండి ఆమె సభ్యురాలిగా ఎన్నిక అవ్వాల్సి ఉంటుంది. పశ్చిమ బెంగాల్ లో మండలి లేదు. కనుక ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవాల్సి ఉంటుంది. మరి మమత ఎక్కడ నుండి పోటీ చేస్తుంది అనేది చూడాలి.
Recent Random Post: