ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం పట్టుబట్టిన నిమ్మగడ్డ రమేష్ అనుకున్నది సాధించాడు. ప్రభుత్వం నుండి మొదట సహకారం అందకున్నా కూడా నోటిపికేషన్ ను జారీ చేయడం జరిగింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో ప్రభుత్వ అధికారులు ఉద్యోగ సంఘాల వారు ఎన్నికల నిర్వహణకు సహకరించేందుకు సిద్దం అయ్యారు. అయితే ఎన్నికల్లో ఎక్కడ అవకతవకలు జరుగకుండా ఉండేలా జాగ్రత్త తీసుకునేందుకు పెద్ద ఎత్తున నిమ్మగడ్డ చర్యలు తీసుకుంటున్నాడు.
అందుకోసం సీమ జిల్లాల్లో స్వయంగా రంగంలోకి దిగి ఎన్నికల నిర్వహణ గురించి తెలుసుకుంటున్నారు. ఎన్నికల కోసం అధికారులు తీసుకుంటున్న జాగ్రత్తలు మరియు ఏర్పట్లను పర్యవేక్షించేందుకు గాను స్వయంగా రంగంలోకి దిగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఎన్నికల విధుల విషయంలో ఉద్యోగులు అధికార పార్టీకి సహకరిస్తున్నారు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఎస్ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
Recent Random Post: