చెక్ నిన్ను చూడకుండా: ట్రెండీ రొమాంటిక్ నెంబర్

యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ సినిమా చెక్. షూటింగ్ ముగించుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 26న విడుదలకు సిద్ధమైంది. చెక్ ప్రమోషన్స్ కూడా సాఫీగా సాగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఉరి శిక్ష పడ్డ ఖైదీగా నితిన్ ఈ చిత్రంలో కనిపించనున్నాడు. అలాగే ఈ సినిమాకు చెస్ యాంగిల్ కూడా ఇవ్వడం విశేషం.

విలక్షణ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నుండి నిన్ను చూడకుండా అనే సాంగ్ ను విడుదల చేసారు. కళ్యాణి మాలిక్ ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా పనిచేసాడు. తన స్టైల్ లోనే సాఫ్ట్ రొమాంటిక్ నెంబర్ ను స్కోర్ చేసాడు.

శ్రీమణి అందించిన సాహిత్యం క్యాచీగా ఉంది. కచ్చితంగా ఈ సాంగ్ సూపర్ హిట్ గా నిలిచే అవకాశముంది. హరిచరణ్, శక్తిశ్రీ గోపాలన్ ఈ సాంగ్ ను ఆలపించారు. మొత్తంగా చెక్ సరైన అంచనాలను ఏర్పరుచుకుంది.


Recent Random Post: