ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఆయన తనయుడు ఎమ్మెల్సీ నారా లోకేష్ లు కరోనా బారిన పడ్డ విషయం తెల్సిందే. వారు ఇద్దరు కూడా స్వల్ప లక్షణాలతో కోవిడ్ పాజిటివ్ గా నిర్థారణ అయ్యారు. మొదట లోకేష్ కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అవ్వగా ఇప్పుడు ఆయన తండ్రి చంద్రబాబు నాయుడు కూడా కరోనా అంటూ తేలడంతో తెలుగు దేశం పార్టీ నాయకులు మొదలు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరియు ప్రతిపక్ష నాయకులు మరియు మంత్రులు పలువురు ఆయన స్పీడ్ గా రికవరీ అవ్వాలని ప్రార్థిస్తున్నారు.
ఈ సమయంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా చంద్రబాబు నాయుడు మరియు లోకేష్ లు త్వరగా కోలుకోవాలని ప్రార్థించాడు. చంద్రబాబు మామయ్య లోకేష్ మీరు త్వరగా కోలుకోవాలి కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశాడు. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ షేర్ చేసిన ఈ విషయం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
Recent Random Post: