CM KCR Meeting With Employees Union Leaders
మహేష్ – బాలయ్య సినిమాలపై క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్..!

టాలీవుడ్ లో కమర్షియల్ సినిమాలకి తనదైన శైలిలో కామెడీని జోడించి సూపర్ హిట్స్ అందుకుంటున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి. ‘పటాస్’ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసి అపజయం ఎరుగని దర్శకుడిగా కొనసాగుతున్నాడు. ‘ఎఫ్ 2’ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అనిల్.. గతేడాది ప్రారంభంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం ‘ఎఫ్ 2’ ఫ్రాంచైజీలో విక్టరీ వెంకటేష్ – వరుణ్ తేజ్ హీరోలుగా ‘ఎఫ్ 3’ సినిమా తెరకెక్కిస్తున్నాడు అనిల్. ఇప్పటికే 22 రోజుల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 27న రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ సినిమా తర్వాత అనిల్ చేయబోయే ప్రాజెక్ట్ ఎంటనేది ఆసక్తికరంగా మారింది.
అనిల్ రావిపూడి తదుపరి సినిమా నందమూరి బాలకృష్ణతో ఉంటుందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అలానే సూపర్ స్టార్ మహేష్ బాబుతో మరో బ్లాక్ బస్టర్ తీయడానికి రెడీ అవుతున్నాడని టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వీటిపై అనిల్ క్లారిటీ ఇచ్చాడు. మహేష్ – బాలకృష్ణ లను డైరెక్ట్ చేయబోతున్నారా? అని అడుగగా.. ఈ చిత్రాలన్నీ తప్పనిసరిగా పైప్ లైన్ లో ఉన్నాయని అనిల్ చెప్పుకొచ్చారు. అయితే అవన్నీ ప్రస్తుతం చర్చల దశలోనే ఉన్నాయని.. నా ఫోకస్ మొత్తం ఇప్పుడు ‘ఎఫ్ 3’ మీద మాత్రమే ఉందని.. ఈ సినిమా విడుదలైన తర్వాత నా తదుపరి ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తాను అని అన్నారు. మహేష్ మరియు బాలయ్యలతో స్టోరీస్ పైప్ లైన్ లో ఉన్నాయి కానీ ఏ ప్రాజెక్ట్ గురించి ఇంకా కంఫర్మేషన్ లేదు అని అనిల్ రావిపూడి తెలిపారు.
కాగా సక్సెస్ ఫుల్ సినిమాలు తీస్తూ బస్టర్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న అనిల్ రావిపూడి ఇప్పుడు ప్రొడ్యూసర్ గా మారాడు. “గాలి సంపత్” అనే సినిమాకి దర్శకత్వ పర్యవేక్షణ చేయడంతో పాటు నిర్మాణంలో కూడా భాగం పంచుకుంటున్నాడు. రాజేంద్రప్రసాద్ – శ్రీవిష్ణు ప్రధాన పాత్రలతో అనీష్ కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా శివరాత్రి సందర్భంగా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
త్వరలో పీరియాడిక్ డ్రామాతో తెరమీదకు బర్నింగ్ స్టార్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో బర్నింగ్ స్టార్ అంటే గుర్తుపట్టని వారిండరు. ఎందుకంటే మనిషి షార్ట్ కావచ్చు కానీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాక తక్కువ కాలంలోనే మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. అతనే సంపూర్ణేశ్ బాబు. 2014లో మొదటి సినిమా ‘హృదయ కాలేయం’తోనే ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు సంపూ. కానీ వరుసగా అదే సక్సెస్ రేట్ మెయింటైన్ చేయలేకపోయాడు. ఫస్ట్ సినిమా తర్వాత వరుసగా పరాజయాలను ఖాతాలో వేసుకున్నాడు. అయితే భారీ విరామం తర్వాత కొబ్బరిమట్ట అనే సినిమాతో ఓ మోస్తరు హిట్ అందుకున్నాడు. తన ప్రతీ సినిమాలో ఏదొక ప్రయోగం చేసే సంపూ.. ఆమధ్య ఏకంగా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ నేపథ్యంలో ఓ సినిమా చేస్తున్నట్లు తెలిపాడు. అదే సమయంలో సంపూ పుట్టినరోజు సందర్బంగా ఆ చిత్రయూనిట్ సంపూ సినిమా పోస్టర్ కూడా విడుదల చేసింది.
ఇంకా పేరు కూడా పెట్టని ఈ సినిమా ఓ మెడికల్ థ్రిల్లర్ గా రూపొందుతుందని సమాచారం. ఆ పోస్టర్లలో వుహాన్ గబ్బిలాల మార్కెట్ లో చిత్రీకరించిన చివరి సినిమా ఇదేనంటూ ఆసక్తి రేకేత్తించారు. కానీ లాక్డౌన్ ముగిసి ఇన్నినెలలు గడుస్తున్నా ఆ సినిమా ఊసే లేదు. ఆ విషయం పక్కనపెడితే.. త్వరలో మరో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసేపనిలో ఉన్నాడట సంపూ. ‘క్రేజీ అంకుల్స్’ అనే సినిమా రూపొందిస్తున్న కిరణ్ తలసియా దర్శకత్వంలో ఆ సినిమా ఉండబోతుందట. అలాగే సంపూ ప్రధానపాత్రధారిగా నటించనున్న ఈ సినిమాకు ‘గోల్డ్ మ్యాన్’ అనే పేరును పరిశీలిస్తున్నారట. అదికూడా ఓ పీరియడిక్ డ్రామాగా తెరకెక్కనుందని సినీవర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మొత్తానికి సంపూ మళ్లీ ఫామ్ లోకి వస్తాడనే ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
హృతిక్.. ప్రభాస్ ‘వార్’ రేంజ్ మూవీ

బాహుబలి.. సాహో సినిమాలతో పాన్ ఇండియా సూపర్ స్టార్ గా గుర్తింపు దక్కించుకున్న ప్రభాస్ ను బాలీవుడ్ సినిమాల్లో నటింపజేసేందుకు ఉత్తరాది ఫిల్మ్ మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. బడా నిర్మాణ సంస్థలు ప్రభాస్ డేట్ల కోసం విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. కరణ్ జోహార్ తో పాటు ప్రముఖ నిర్మాతలు కూడా ప్రభాస్ తో సినిమాలను నిర్మించేందుకు వందల కోట్ల బడ్జెట్ తో సిద్దంగా ఉన్నారు. ఇప్పటికే ప్రభాస్ తన మొదటి బాలీవుడ్ సినిమా ఆదిపురుష్ ను చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత బాలీవుడ్ లో ప్రభాస్ చేయబోతున్న తదుపరి సినిమా కూడా ఖరారు అయ్యింది అంటూ జాతీయ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
వార్ వంటి బిగ్గెస్ట్ యాక్షన్ మూవీని తెరకెక్కించిన దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిల్మ్స్ వారు హృతిక్ రోషన్ మరియు ప్రభాస్ లతో భారీ యాక్షన్ సినిమాను తెరకెక్కించేందుకు చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ తో పఠాన్ సినిమా ను తెరకెక్కిస్తున్న సిద్దార్థ్ ఆనంద్ వచ్చే ఏడాది చివరి వరకు హృతిక్ మరియు ప్రభాస్ ల కాంబో మూవీని పట్టాలెక్కించేలా ప్రయత్నాలు చేస్తున్నారట. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాల జాబితా చాలా పెద్దగానే ఉంది. వాటికి తోడు ఇప్పుడు వార్ వంటి భారీ యాక్షన్ సినిమా ను చేసేందుకు ముందుకు రావడం ఆయన అభిమానులకు చాలా ఆనందాన్ని కలిగించే విషయం అంటూ ఇండస్ట్రీ వర్గాల అంటున్నారు. హృతిక్ రోషన్ మరియు ప్రభాస్ నిజమైన సూపర్ స్టార్స్ మల్టీ స్టారర్ మూవీ అవ్వడం ఖాయం అనిపిస్తుంది. ఈ విషయమై త్వరలో క్లారిటీ వస్తుందేమో చూడాలి.
ఆ ఇద్దరికి కరోనా సోకడంతో ‘RRR’ టీమ్ కలవర పడుతోందా..?

బాలీవుడ్ లో మళ్ళీ కరోనా కలకలం మొదలైంది. స్టార్ హీరో రణబీర్ కపూర్ కరోనా బారిన పడ్డారు. అలానే ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత సంజయ్ లీలా భన్సాలీకి కూడా కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇప్పటికే ఐసోలేషన్ లో ఉన్న వీరిద్దరూ చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో తమతో కాంటాక్ట్ అయిన వారిని కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోమని కోరారని తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఇద్దరు బాలీవుడ్ ప్రముఖులకు కరోనా సోకడంతో ‘ఆర్.ఆర్.ఆర్’ టీమ్ లో టెన్షన్ మొదలైందని ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది.
వివరాల్లోకి వెళ్తే రణబీర్ కపూర్ గర్ల్ ఫ్రెండ్ ఆలియా భట్ ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ‘గంగూబాయి కతియావాడి’ సినిమాలో లీడ్ రోల్ చేస్తోంది. అలానే తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ కి తనతో సినిమా చేస్తున్న దర్శకుడికి కోవిడ్ రావడంతో ఆలీయా భట్ టెస్ట్ చేయించుకోవడంతో పాటు సెల్ఫ్ క్వారెంటైన్ లో ఉన్నారని తెలుస్తోంది. దీంతో ‘గంగూబాయి’ సినిమా షూటింగ్ కు అంతరాయం ఏర్పడింది. ఇదే క్రమంలో ఇప్పుడు ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ కి బ్రేక్ పడుతుందేమో అని చిత్ర యూనిట్ కలవరపడుతోందట.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – అలియా భట్ లపై ఓ సాంగ్ షూట్ చేయడానికి ట్రిపుల్ ఆర్ టీమ్ గ్రాండ్ సెట్ వేసినట్లు తెలుస్తోంది. రాజమౌళి ఈ వారాంతంలో పాట చిత్రీకరణకు ప్లాన్ చేస్తున్నారని.. అలియా మరికొన్ని రోజుల్లో హైదరాబాద్ కు రానుందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు అలియా క్వారెంటైన్ లో ఉండటంతో షూటింగ్ ప్లాన్స్ అన్నీ చేంజ్ చేయాల్సి వస్తుందేమో అని చిత్ర బృందం ఆలోచిస్తోందట. తారక్ – చరణ్ కలిసి నటిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రాన్ని దసరా సందర్భంగా అక్టోబర్ 13న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించడంతో జక్కన్న దానికి తగ్గట్లే శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు. అయితే ఇప్పుడు ఒకవేళ అలియా కారణంగా షూట్ కి బ్రేక్ పడితే మాత్రం అది ట్రిపుల్ ఆర్ టీమ్ కి తలనొప్పిగా మారే అవకాశం ఉందని చెప్పవచ్చు.
Trivikram Penning Super Strong Dialogues For Hero & Villain!

Before starting his work on #NTR30, star writer-director Trivikram Srinivas is providing the dialogues for ‘Ayyappanum Koshiyum’ remake. He is even involved in the scripting stage and reportedly suggested some vital changes in order to suit the image of our stars and to match the Telugu nativity. Directed by Saagar K Chandra, this most-awaited remake is bankrolled under ‘Sithara Entertainments’ banner by Naga Vamsi. This is the 12th film from this production house and Thaman is scoring music for it.
As we know, Pawan Kalyan will be playing the lead while Rana Daggubati will be challenging him onscreen. Just like the original, the combination and confrontation scenes between these two roles is expected to be the major highlight of this film and grapevine suggests that Trivikram penned some powerful dialogues for both of them. Hailed as ‘Wizard of Words’, Trivikram Srinivas is known for his strong dialogues which elevate heroism and touching dialogues that teach us life lessons. Apparently, there will be plenty of them both in this remake. The shooting has already begun and it is expected to hit the screens by the end of this year.
Bollywood’s Crazy Hero Eyeing On ‘Uppena’!

If there is any movie that connected with the audience a lot in recent times, it is definitely ‘Uppena’. This emotional love story which marked the entry of Vaisshnav Tej and Krithi Shetty into Tollywood has become a huge hit. The super hit songs couple with Buchi Babu Sana’s compelling narration helped the film in becoming a blockbuster. The producers recently announced that the film crossed the 100 crores mark.
These days Bollywood actors are taking a deep look on South Indian movies. They are remaking our hit movies and scoring blockbusters in Hindi. Films like ‘Arjun Reddy’ and ‘Jersey’ are a big proof. Inside sources reveal that Bollywood crazy hero Varun Dhawan fell in love with ‘Uppena’ and is making moves to remake it. He is reportedly impressed by the looks and performance of Krithi Shetty that he is planning to rope her in as the heroine in the remake too.
But it is said that the Mythri Movie Makers team is quoting a very high rate for the remake right which made Varun & Co to keep the talks on hold for now. We need to wait and see how things move forward from here.
Stories Are Ready For Balakrishna & Mahesh’s Movies: Anil Ravipudi

Star director Anil Ravipudi is busily promoting ‘Gaali Sampath’ which is releasing this Thursday. He provided the screenplay, dialogues and even supervised the direction department for this emotional entertainer featuring Rajendra Prasad and Shree Vishnu.
The young filmmaker recently opened up about his upcoming projects during an interview. When asked about the prospects of working with Balakrishna and Mahesh Babu in the future, Anil said that these films are in the pipeline and the stories are ready for both the heroes. But he added that they are still in the discussion stages. Ravipudi made it clear that he will be focusing on these projects only after completing ‘F3’. He hinted at a possible chance of working with these star heroes in the future but did not give any confirmation.
Currently, Anil Ravipudi is working on ‘F3’ which is a sequel of the super hit 2019 Sankranti release ‘F2’. This film also features Victory Venkatesh and Mega Prince Varun Tej in the lead. Tamanna and Mehreen will be seen as wives in this film respectively. Dil Raju is bankrolling this project while Devi Sri Prasad is the music composer.















