వైకాపా రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజుకు ఆర్మీ ఆసుపత్రి కాలికి ఎడిమా మాత్రమే ఉందని పేర్కొంది. ఆయన కాలిపై ఉన్నవి గాయాలు కాదని, ఆయన గాయాల బారిన పడ్డట్లుగా ఆసుపత్రి వర్గాల వారు నిర్థారించలేదు అంటూ సీఐడీ అధికారులు పేర్కొన్నారు. రఘురామ కాలికి ఉన్న గాయాలు పోలీసు వారి కారణంగా అయినవి కాదని.. ఆయన పోలీసు వారి కస్టడీలో ఉండగ కూడా అయ్యింది కాదంటూ ఆర్మీ ఆసుపత్రి నిర్థారించింది.
రఘురామకు జిల్లా జైలు డ్యూటీ డాక్టర్ ఎలాంటి గాయాలు లేవని క్లీయర్ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగిందని కూ డా సీఐడీ అధికారులు పేర్కొన్నారు. ఆ గాయాలకు కారణం పోలీసులు అని సీఐడీ అధికారులు అంటూ కోర్టులో రఘురామ పేర్కొన్న విషయం తెల్సిందే. ఆ విషయాన్ని ఖండించే ఉద్దేశ్యంతోనే సీఐడీ అధికారులు ఈ విషయాన్ని వెళ్లడించారు. ఆర్మీ ఆసుపత్రి సుప్రీం కోర్టుకు సమర్పించిన నివేధికలో ఎలాంటి ఆధారాలు సీఐడీకి వ్యతిరేకంగా లేవు అంటూ వారు పేర్కొన్నారు.
Recent Random Post: