బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ గారాల పట్టి సుహానా ఖాన్ పుట్టిన సందర్బంగా ఆమె అభిమానులు మరియు షారుఖ్ అభిమానలు సోషల్ మీడియాలో తెగ హడావుడి చేశారు. గౌరీ ఖాన్ ట్విట్టర్ లో సుహానా ఖాన్ ఫొటో షేర్ చేసి నీపై మా ప్రేమ ఎప్పటికి ఉంటుంది అంటూ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ తో చాలా మంది స్పందించారు. వందల మంది హ్యాపీ బర్త్ డే సుహానా అంటూ కామెంట్ చేశారు.
ఒక్కడు మాత్రం విభిన్నంగా ట్విట్టర్ లో స్పందించాడు. నాకు నెలకు లక్ష రూపాయలకు పైగా జీతం వస్తుంది. నాకు మీ అమ్మాయిని ఇస్తారా పెళ్లి చేసుకుంటాను అంటూ ప్రపోజల్ పెట్టాడు. దానికి గౌరీ ఖాన్ రెస్పాండ్ అవ్వలేదు. కాని ఆయన ట్వీట్ కు షారుఖ్ అభిమానులు ఘాటుగా స్పందిచారు. నీకు నెల కు వచ్చే లక్ష రూపాయలను సుహానా ఖాన్ కేవలం వారం రోజుల్లో ఖర్చు చేస్తుంది. అలాంటి ఆమెను నీవు ఎలా పోషిస్తావు. వారికి ఉన్న వేల కోట్ల ఆస్తిలో నీ లక్ష దేనికి సమానం అంటూ కామెంట్స్ చేశారు.
Recent Random Post: