తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్మారకం వద్ద శశికళ నివాళ్లు అర్పించారు. ఆ సమయంలో కాస్త రాజకీయ హడావుడి కనిపించింది. అన్నాడీఎంకే జెండాలు పట్టుకున్న అభిమానులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడ సందడి చేశారు. అదే సమయంలో ఆమె అన్నాడీఎంకే జెండాను కలిగి ఉన్న కారులో అక్కడకు వచ్చింది. అన్నాడీఎంకే పార్టీకే కాదు పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లుగా చెప్పుకొచ్చిన శశికళ ఇలాంటి పనులు చేయడం తో మళ్లీ ఆమె రాజకీయ ఎంట్రీ గురించి.. ప్రభావం గురించిన చర్చ మొదలు అయ్యింది.
అన్నాడీఎంకే లోకి శశికళ ఎంట్రీపై మాజీ మంత్రి.. ఆ పార్టీ అధికార ప్రతినిధి డి జయకుమార్ మాట్లాడుతూ.. అమ్మ వల్ల లబ్ది పొందిన వారిలో శశికళ ఒకరు. ఆమె పార్టీలోకి రావడం అనేది జరగని పని. అమ్మ సమాది వద్ద ఆమె నటించిన తీరుతో ఆమెకు ఆస్కార్ లభించడం ఖాయం.. కాని అన్నాడీఎంకే పార్టీలో మాత్రం ఆమెకు అవకాశం లేదు అంటూ తేల్చి చెప్పారు. అమ్మ పేరు చెప్పి మళ్లీ శశికళ మళ్లీ అన్నాడీఎంకేలోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని కొందరు అంటున్నారు. డీఎంఎకే అద్బుతమైన విజయంతో అన్నాడీఎంకే ఇప్పట్లో తేరుకోవడం సాధ్యం అయ్యే పని కాదు. ఒక వేళ శశికళ వస్తే అప్పుడు ఏమైనా అద్బుతం జరుగుతుందేమో చూడాలి.
Recent Random Post: