తమిళనాట అసెంబ్లీ ఎన్నికల హడావుడి మామూలుగా లేదు. ప్రతి నియోజక వర్గంలో సీనియర్ నేతలు ముఖ్యనేతలు చక్కర్లు కొడుతున్నారు. ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు చేస్తున్న వ్యాఖ్యలు వాడి వేడీగా ఉంటున్నాయి. అన్నాడీఎంకే మరియు డీఎంకే నాయకుల మద్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా ఉంది. ఇటీవల అన్నాడీఎంకే అధినేత్రి మాజీ ముఖ్యమంత్రి జయలలిత పై ఆమె మృతిపై డీఎంకే అధినేత స్టాలిన్ మరియు ఆయన తనయుడు ఉదయనిధి స్టాలిన్ లు అనుచిత వ్యాఖ్యలు చేయడంపై అధికార పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అమ్మ జయలలిత మృతి విషయం కోర్టు పరిగణలో ఉంది. ఇలాంటి సమయంలో ఎవరు కూడా మాట్లాడకుండా ఉండాలి. కాని డీఎంకే నాయకులు స్టాలిన్ మరియు ఉదయనిధి స్టాలిన్ లు అమ్మ మృతిపై వ్యాఖ్యలు చేసి జనాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కోర్టులో ఉన్న విషయాన్ని గురించి జనాల్లో మాట్లాడటం కోర్టు దిక్కరణ కింద పరిగణించాలంటూ ఎన్నికల కమీషన్ ను అన్నాడీఎంకే నేతలు కోరుతున్నారు. ఇప్పటికే తండ్రి కొడుకులపై ఫిర్యాదు ఇవ్వడంతో ఏం జరుగుతుందో అనే ఆసక్తి అందరిలో కనిపిస్తుంది.
Recent Random Post: