తమిళనాడు ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ఈ నెల 7వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిరంబరాడంగా జరుపుతామని స్టాలిన్ ఇప్పటికే ప్రకటించారు. నిన్నటి ఫలితాల్లో విజయం సాధించిన అనంతరం తండ్రి కరుణానిధి సమాధి వద్ద నివాళులర్పించారు స్టాలిన్. ప్రజలకిచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని ఈ సందర్భంగా స్టాలిన్ మీడియాకు తెలిపారు.
ద్రావిడ పార్టీ దిగ్గజాలు.. కరుణానిధి, జయలలిత మరణం తర్వాత జరిగిన ఎన్నికల్లో డీఎంకే పార్టీ సత్తా చాటింది. 234 అసెంబ్లీ స్థానాల్లో 156 కైవసం చేసుకుంది. పదేళ్ల నిరీక్షణ అనంతరం డీఎంకేకు అధికారం దక్కింది. స్టాలిన్ కొలత్తూరు నుంచి గెలుపొందగా.. ఆయన తనయుడు ఉధయనిధి స్టాలిన్ చెన్నైలోని చెపాక్ నుంచి గెలుపొందారు.
Recent Random Post: