గవర్నర్ అధికారిక పర్యటనకు హెలికాఫ్టర్ పంపని సీఎం..! ఎక్కడంటే..

మహారాష్ట్ర గవర్నర్ కోషియారిపై సీఎం సీఎం ఉద్ధవ్ థాకరే ప్రవర్తించిన తీరు సంచలనం రేపుతోంది. గురువారం డెహ్రాడూన్ పర్యటనకు సిద్ధమైన గవర్నర్ కు ప్రభుత్వ హెలికాప్టర్‌ పంపించ లేదు. రెండు గంటల 15 నిముషాలు వేచి చూస్తూ ఉండిపోయారు గవర్నర్. అప్పటికీ హెలికాఫ్టర్ పంపించలేదు. తర్వాత అధికారులు వచ్చి ప్రభుత్వం హెలికాఫ్టర్ పంపించేందుకు ససేమిరా అంగీకరించలేదని తెలిపారు. దీంతో గవర్నర్ అప్పటికప్పుడు ప్రైవేట్ ఫ్లైట్‌ను బుక్ చేసుకొని ఉత్తరాఖండ్‌కు వెళ్లారు.

ప్రభుత్వ తీరుపై గవర్నర్ కార్యాలయ అధికారులు మండిపడ్డారు. గవర్నర్ ఉత్తరాఖండ్ పర్యటనపై వారం క్రితమే ప్రభుత్వానికి సమాచారం అందించామని.. అయినా ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఏమాత్రం బాగోలేదన్నారు. ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలా చేయడం దురదృష్టకరం. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న ఓ గవర్నర్ పట్ల ఇలా చేయడం తగనిది. రాష్ట్ర చరిత్రలో ఇదో చీకటి అధ్యాయం’ అని అన్నారు.


Recent Random Post: