తన కథనాలపై గట్టిగానే నిలబడతానంటున్నారు ‘సీబీయెన్ కిట్టు’. టీడీపీ అధినేత చంద్రబాబు కనుసన్నల్లో నడుస్తున్నట్లే కనిపిస్తూ, 2019 ఎన్నికల్లో టీడీపీని పాతరేయడంలో కీలక పాత్ర పోషించిన ‘కిట్టు’, వైసీపీ మీద తన అక్కసునంతా వెల్లగక్కే క్రమంలో అన్నా చెల్లెళ్ళ మధ్య అగాధం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు.
రాజకీయాల్లో, రాజకీయ పార్టీల మధ్య వైరం వుండాలి. కానీ, ఇక్కడ వ్యవస్థల్ని తన కనుసన్నల్లో నడిపించాలనే కక్కుర్తి ‘బూతు కిట్టు’ది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వైసీపీ అధినేత, ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోదరి షర్మిల కు వ్యతిరేకంగా ఇటీవల ఓ పెద్ద కథనాన్ని వండి వడ్డించాడు కిట్టు. అది కాస్తా గట్టిగానే పేలింది. అంతలోనే, షర్మిల స్పందనతో తుస్సుమంది కూడా. జగన్ విషయంలో షర్మిల రివర్స్ గేర్ వేసే అవకాశమే లేదు.
ఎందుకంటే, వైఎస్ జగన్ ఇప్పుడు ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి. ఏ కుటుంబంలో అయినా, చిన్నా చితకా అభిప్రాయ బేధాలుండొచ్చుగాక. అంత మాత్రాన ముఖ్యమంత్రిని వ్యతిరేకించే స్థాయికి ఆ ముఖ్యమంత్రి సోదరి పావులు కదిపే అవకాశం వుందా.? పైగా, ఆమెకు జగన్ సోదరి.. వైఎస్సార్ కుమార్తె.. అన్న గుర్తింపు తప్ప, సోలో ఇమేజ్ లేదాయె. అయినా, తెలంగాణలో కొత్త పార్టీ పెట్టి షర్మిల ఏం సాధించగలుగుతారు.? అన్నయ్య జగన్ మీద పై చేయి ఎలా సాధించగలుగుతారు? ఈమాత్రం లాజిక్ తెలియకుండా ఓ చెత్త వంటకం వండి, జనం ముందు పారేసిన ‘బూతు కిట్టు’ అది కాస్తా చెల్లుబాటవకపోవడంతో డీలాపడ్డారు.
షర్మిల, ఈ కథనాన్ని ఖండిస్తూ, అల్టిమేటం కూడా జారీ చేశాక, వివాదాన్ని మరింత రాజేయడానికి మళ్ళీ ‘బూతు కిట్ట’ ఇంకో వెకిలి రాత రాసేశాడు. విజయమ్మ, బెంగళూరుకి హుటాహుటిన ఎందుకు వెళ్ళారు.? ఎవరో రాసిచ్చిన లేఖ మీద ఇష్టం లేకపోయినా ఎందుకు సంతకం పెట్టారు.? అని ప్రశ్నించేశారు. ఆ లేఖ, షర్మిల సోషల్ మీడియా పేజీ ద్వారా పోస్ట్ చేశాక.. ఇంకా వివాదం ఏముంటుంది.? ఎవరో ఒకరు తనను నీఛంగా తిట్టకపోతే ‘బూతు కిట్టు’కి నిద్ర పట్టదేమో అన్నట్టు తయారైంది వ్యవహారం.
Recent Random Post: