
తల అజిత్ ఇటీవలే విదాముయార్చీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో అజిత్ అభిమానులు, సినిమా ప్రేమికులు ఇప్పుడు ఆయన తదుపరి సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుండగా, అజిత్ 64వ సినిమాకి ఏ దర్శకుడితో కలిసి పనిచేయబోతున్నాడన్నది హాట్ టాపిక్‌గా మారింది.
ఈ ప్రాజెక్ట్ కోసం పలు స్టార్ డైరెక్టర్లు అజిత్‌ను సంప్రదించినట్టు సమాచారం. ప్రశాంత్ నీల్, లోకేష్ కనగరాజ్, సిరుత్తై శివ, వెంకట్ ప్రభు, కార్తీక్ సుబ్బరాజ్‌ల వంటి టాప్ డైరెక్టర్లు ఇప్పటికే కథలు వినిపించి, ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటి వరకు అజిత్ ఎవ్వరినీ ఫైనల్ చేయలేదు.
కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం, కార్తీక్ సుబ్బరాజ్‌కు ఈ ప్రాజెక్ట్ దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం త్వరగా ఓ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించి, వేగంగా పూర్తిచేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో, కార్తీక్ సుబ్బరాజ్ అజిత్‌కు బెస్ట్ ఆప్షన్‌గా కనిపిస్తున్నాడు. మిగతా దర్శకులు తమ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్‌తో సినిమా చేయబోతుండగా, లోకేష్ కనగరాజ్ కూలీ తరువాత ఖైది 2 ప్రాజెక్ట్‌తో బిజీ అవుతాడు. అలాగే సిరుత్తై శివ, వెంకట్ ప్రభులు కూడా తమ ఇతర సినిమాలతో తీరికలేని పరిస్థితిలో ఉన్నారు.
ఇదిలా ఉండగా, అజిత్ సినిమాలే కాకుండా కార్ రేసింగ్ పట్ల కూడా అంతే ఆసక్తి కనబరుస్తున్నాడు. ప్రస్తుతానికి స్పెయిన్ మోటార్ రేసింగ్ పోటీలో పాల్గొంటున్న ఆయన, తిరిగి వచ్చిన తరువాత అజిత్ 64 పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. మరి, ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు చివరికి ఎవరు దర్శకత్వం వహిస్తారో వేచిచూడాలి!
Recent Random Post:















