అజిత్-ధనుష్ క్రేజీ కాంబో పై సస్పెన్స్!

Share


స్టార్ హీరో అజిత్ – మల్టీటాలెంటెడ్ ధనుష్ కాంబినేషన్‌లో ఓ భారీ సినిమా రాబోతోందని కోలీవుడ్‌లో బలమైన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల ధనుష్ దర్శకత్వంలో అజిత్ హీరోగా ఓ ప్రాజెక్ట్ మొదలవుతున్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా, ఈ ప్రాజెక్ట్‌పై మరిన్ని ఆసక్తికర వివరాలు బయటకు వచ్చాయి.

‘ఇడ్లీ కడై’ చిత్రాన్ని నిర్మిస్తున్న డాన్ పిక్చర్స్ సంస్థకు చెందిన నిర్మాత ఆకాష్ భాస్కరన్ అజిత్-ధనుష్ ప్రాజెక్ట్‌పై స్పందించారు. “ఈ సినిమా చర్చలు ఇప్పుడే ప్రారంభ దశలో ఉన్నాయి. ఇంకా అధికారికంగా ఏదీ ఫైనల్ కాలేదు. ప్రాజెక్ట్ ఓకే అయితే అన్ని వివరాలు ప్రకటిస్తాం” అని క్లారిటీ ఇచ్చారు.

అయితే, ఈ ప్రకటనతో అజిత్-ధనుష్ ప్రాజెక్ట్ పక్కా అనే ఊహాగానాలు మరింత బలపడాయి. నిజంగా ఇది ఒక ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ధనుష్ తన దర్శకత్వ ప్రయాణాన్ని ‘పా పాండి’, ‘రాయన్’ సినిమాలతో ప్రారంభించాడు. ప్రస్తుతం ‘ఇడ్లీ కడై’, ‘నిలవాక్కు ఎన్ మెల్ ఎన్నడి కోబం’ చిత్రాలను తెరకెక్కిస్తున్నాడు. ఇంతలోనే అజిత్‌తో ఓ భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేయడం ఆసక్తికరంగా మారింది.

ఇటీవల కాలంలో అజిత్ సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఆయనకి కార్ రేసింగ్‌పై ఉన్న ఆసక్తి, సినిమాలపై తగ్గిన ఫోకస్ గురించి కోలీవుడ్ మీడియాలో ఎన్నో కథనాలు వచ్చాయి. ఇలాంటి సమయంలో ధనుష్ డైరెక్షన్‌లో అజిత్ సినిమా చేయడం వెనుక ఓ ప్రత్యేక కారణం ఉందని అనిపిస్తోంది.

ప్రస్తుతం ధనుష్ కూడా హీరోగా కొన్ని ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. అయితే, తన షెడ్యూల్ పూర్తయ్యాక అజిత్ ప్రాజెక్ట్‌పై పూర్తి ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. అధికారిక ప్రకటన వచ్చేవరకు కోలీవుడ్ సినీ ప్రేమికులు ఈ క్రేజీ కాంబినేషన్‌పై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


Recent Random Post: