అమీర్ ఖాన్ కొత్త ప్రేమ – మాజీ భార్యలపై స్పందన

Share


బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ 60 ఏళ్ల వయస్సులో మరోసారి ప్రేమలో పడటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బెంగళూరుకు చెందిన గౌరీ స్ప్రాట్‌తో ఆయన స్నేహం ప్రేమగా మారి ఇప్పుడు అధికారికంగా అందరికీ తెలుసు. ఆమెను మీడియాకు పరిచయం చేస్తూ అన్ని పుకార్లకు ముగింపు పలికాడు. అయితే మాజీ భార్యలైన రీనా దత్తా, కిరణ్ రావుతో తన సంబంధం ఎలా ఉందో చెప్పిన వివరాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. రీనా, కిరణ్, వారి కుటుంబాలు ఇప్పటికీ తన కుటుంబమేనని అమీర్ ఖాన్ స్పష్టం చేశాడు. భార్యాభర్తలుగా దూరమైనా మానవులుగా ఎప్పటికీ దగ్గరగానే ఉన్నామని చెప్పాడు. ఇద్దరు భార్యల నుంచీ ఎంతో నేర్చుకున్నానని, వారు తన జీవితానికి కీలకమైన భాగమని చెప్పాడు.

60 ఏళ్ల వయసులో మళ్లీ ప్రేమలో పడతానని తాను ఊహించలేదని అమీర్ చెప్పాడు. ఈ వయసులో భాగస్వామి దొరకడం అదృష్టమని, గౌరీ తనకు ప్రశాంతతను, స్థిరత్వాన్ని ఇస్తుందని వివరించాడు. ఆమెను కలవడం, తన ముగ్గురు భార్యలను జీవితంలో చూడడం తన అదృష్టమని వ్యాఖ్యానించాడు. రీనా దత్తాతో 1986లో జరిగిన వివాహం 16 సంవత్సరాల వైవాహిక జీవితం తరువాత 2002లో ముగిసింది. తరువాత 2005లో కిరణ్ రావుతో వివాహం చేసుకున్న ఆయనకు ఆజాద్ అని ఒక కుమారుడు ఉన్నాడు. 2021లో వీరిద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించారు. గౌరీ స్ప్రాట్‌ను 25 ఏళ్లుగా తెలుసునని, గత 18 నెలలుగా డేటింగ్‌లో ఉన్నామని అమీర్ పేర్కొన్నాడు. ఆమె ఇప్పుడు ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్‌లో పనిచేస్తోంది. ఆమెకు ఆరేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు.

ప్రస్తుతం అమీర్ ఖాన్ కెరీర్ విషయానికి వస్తే, ఆయన తదుపరి ‘హ్యాపీ పటేల్: ఖతర్నాక్ జాసూస్’ సినిమాలో అతిథి పాత్రలో కనిపించబోతున్నారు. హాస్యనటుడు వీర్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. అమీర్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ కూడా ఈ చిత్రంతో మళ్లీ పెద్ద తెరపైకి రాబోతున్నాడు. ఈ స్పై–కామెడీ జనవరి 16, 2026న విడుదల కానుంది.


Recent Random Post: