Skip to content
ManaTelugu

Telugu News, Cinema, Technology and NRI Updates

  • Home
  • News
    • Film News
    • Political NewsPolitical News about Andhra Pradesh state and Telangana State and other India News
  • NRINRI news
  • TechnologyTechnology
  • Reviews
  • International
Subscribe
Home » Telugu News » ఇండియన్ ఆర్మీపై వ్యాఖ్యలతో వివాదంలో అమీనా నిజమ్
Posted inTelugu News

ఇండియన్ ఆర్మీపై వ్యాఖ్యలతో వివాదంలో అమీనా నిజమ్

Posted by Admin May 9, 2025
Share


‘టర్కిష్ తర్కం’, ‘గ్యాంగ్స్ ఆఫ్ 18’ సినిమాలతో గుర్తింపు పొందిన మలయాళ నటి అమీనా నిజమ్ ఇటీవల చేసిన సోషల్ మీడియా పోస్ట్ కారణంగా తీవ్ర విమర్శలకు గురవుతోంది.

రీసెంట్‌గా కశ్మీర్‌లోని పహల్గామ్ వద్ద పాకిస్తాన్‌ ఉగ్రవాదుల దాడికి ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ నిర్వహించిన “ఆపరేషన్ సిందూర్” గురించి అందరికీ తెలిసిందే. అయితే, ఈ ఘటనపై అమీనా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో స్పందిస్తూ, “ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్‌లోని ప్రజలను చంపడంపై తాను సిగ్గు పడుతున్నాను” అంటూ రాసింది.

ఈ వ్యాఖ్యపై నెటిజన్లు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, ఆమెను దేశ వ్యతిరేకిగా అభివర్ణించారు. “శాంతి పాఠాలు చెప్పడం మంచిదే కానీ, అదే ఉగ్రవాదుల చేతిలో అమాయకులైన భారతీయులు ప్రాణాలు కోల్పోయిన విష‌యాన్ని మ‌ర్చిపోకూడదు” అంటూ పలువురు విమర్శలు గుప్పించారు.

కొంతమంది నెటిజన్లు మరింత ముందుకెళ్లి, ఇలాంటి అభిప్రాయాలు ఉన్నవారికి సినిమా అవకాశాలు ఇవ్వకూడదు అంటూ ఫిల్మ్ మేకర్స్‌ను కోరుతున్నారు. మరోవైపు, ఆమె అభిమానులు సైతం ఈ సందర్భంలో ఆమె చూపిన సానుభూతి తగదని పేర్కొంటూ, “ఇలాంటి సమయాల్లో దేశ పౌరులంతా ఐక్యంగా ఉండాలి. వ్యక్తిగత అభిప్రాయాలు దేశ భద్రతను దెబ్బతీయకూడదు” అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఒకవైపు యుద్ధం పరిష్కారం కాదన్న భావనను సమర్థించాలన్నా, మరోవైపు పాకిస్తాన్‌ మద్దతుతో ఇండియాపై ఉగ్రదాడులు జరుపుతున్న వాస్తవాలను విస్మరించడం సమంజసం కాదన్నది నెటిజన్ల స్థిర అభిప్రాయం.

Tags:
Ameena Nizam backlashAmeena Nizam controversyAmeena Nizam Instagram postAmeena Nizam latest newsAmeena Nizam social mediaIndian army supportIndian army vs PakistanMalayalam actress controversyPakistani terroristspatriotic sentiments Indiaఅమీనా నిజమ్ఆపరేషన్ సిందూర్ఇండియన్ ఆర్మీ వ్యాఖ్యలుఇండియా పాకిస్థాన్ దాడులు
Last updated on May 9, 2025
Admin
View All Posts

Post navigation

Previous Post
హాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన కంగనా రనౌత్
Next Post
ఇలియానా హృదయాన్ని తాకిన మాటలు

Reviews

  • Gaayapadda Simham Review: Outdated Spoof Comedy Falters Despite Fresh Idea
    Gaayapadda Simham Review: Outdated Spoof Comedy Falters Despite Fresh Idea May 1, 2026
  • Jetlee Review: Satya–Ritesh Combo Misfires
    Jetlee Review: Satya–Ritesh Combo Misfires May 1, 2026
  • Kara: Dhanush’s Underwhelming Comeback
    Kara: Dhanush’s Underwhelming Comeback April 30, 2026
  • Michael Jackson Biopic Feels Incomplete Yet Engaging
    Michael Jackson Biopic Feels Incomplete Yet Engaging April 24, 2026
  • Thimmarajupalli TV Review: Honest Attempt
    Thimmarajupalli TV Review: Honest Attempt April 17, 2026

Site Map

  • Home
  • About Us
  • DMCA
  • Privacy Policy
  • Contact Us

Latest Reviews

  • Gaayapadda Simham Review: Outdated Spoof Comedy Falters Despite Fresh Idea (May 1, 2026)
  • Jetlee Review: Satya–Ritesh Combo Misfires (May 1, 2026)
  • Kara: Dhanush’s Underwhelming Comeback (April 30, 2026)
  • Michael Jackson Biopic Feels Incomplete Yet Engaging (April 24, 2026)
  • Thimmarajupalli TV Review: Honest Attempt (April 17, 2026)

Latest NRI News

  • New Zealand Eases Student Visa Rules for Indians (July 22, 2026)
  • Saudi Arabia Introduces Multiple-Entry Umrah Visa (July 22, 2026)
  • US-Iran Tensions Disrupt West Asia Air Travel (July 21, 2026)
  • FIIDS Urges US to Halt Four-Year Student Visa Cap (July 20, 2026)
  • Visa Anxiety Rises Globally, Genuine Travellers Need Not Worry: VFS Global (July 20, 2026)

Scroll to Top