ఏపీ సీఎం చంద్ర‌బాబు దావోస్ ప‌ర్య‌ట‌న‌కు సిద్ధం


ఏపీ సీఎం చంద్ర‌బాబు ఈ నెల 19న స్విట్జ‌ర్లాండ్‌లోని దావోస్‌కి వెళ్ళనున్నారు. అక్కడ జరిగే ప్ర‌పంచ స్థాయి పెట్టుబ‌డుల సదస్సులో ఆయ‌న పాల్గొననున్నారు. ఏపీకి భారీ పెట్టుబ‌డులు ఆహ్వానించడమే ల‌క్ష్యంగా సీఎం ఇప్పటికే గ్రౌండ్ వర్క్ పూర్తి చేశారు. ఏఏ రంగాల్లో ఏపీకి పెట్టుబడులు ఆకర్షించాలో, పెట్టుబడులు పెట్టేవారికి ఇక్కడ ఉన్న అవ‌కాశాలు, సౌకర్యాలు, యువత, ఉపాధి తదితర అంశాలపై ప్ర‌ణాళికలు సిద్ధం చేసుకున్నారు.

ప్రస్తుతం సంక్రాంతి పండుగ సందర్భంగా, సీఎం చంద్ర‌బాబు కుటుంబంతో కలిసి తన స్వంత గ్రామమైన చంద్రగిరి మండలంలోని నారా వారి పల్లెకు వెళ్లారు. పండుగ వేళ మళ్లీ సీఎం పాలనపై దృష్టి పెట్టి, దావోస్ ప‌ర్య‌ట‌న‌కు సిద్ధమవుతారు. ఈ నేప‌థ్యంలో, పెట్టుబడుల సదస్సుకు ఆయనతో వెళ్లే బృందాన్ని కూడా సీఎం సిద్ధం చేసుకున్నారు. సీఎం వెంట ఇద్దరు మంత్రులు మాత్రమే ఉంటారని, ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్‌ పేరు మాత్రం లేకపోవడం గమనార్హం.

ఈ ప‌ర్య‌ట‌న‌కు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా దూరంగా ఉంటున్నారు. రాష్ట్రంలో పాలనను వారం రోజుల పాటు నడిపించేందుకు ఆయన ఇక్కడే ఉంటారు.

పెట్టుబడుల స‌ద‌స్సుకు సీఎం చంద్ర‌బాబు వెంట వెళ్ళే బృందం:

ముఖ్యమంత్రి చంద్ర‌బాబు
మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్
పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్
సీఎం కార్యదర్శి కార్తికేయ మిశ్రా
సీఎం భ‌ద్రతా అధికారి శ్రీనాథ్
ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి యువరాజ్
ఏపీ ఈడీబీ సీఈవో సాయి కాంత్ వర్మ
కుప్పం ప్రాంతీయ అభివృద్ధి ప్రాజెక్టు అధికారి వికాస్ మర్మత్.


Recent Random Post: