‘క్రిష్ 4’ నిర్మాణంలో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ భాగస్వాములా?

Share


భారతీయ సూపర్ హీరో సినిమాల్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న ‘క్రిష్’ ఫ్రాంచైజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు విడుదలైన మూడు భాగాలు భారీ విజయాలు సాధించాయి. ఈ నేపథ్యంలో, ‘క్రిష్ 4’ కోసం దర్శకుడు రాకేష్ రోషన్ గత కొన్ని సంవత్సరాలుగా కృషి చేస్తున్నారు. కథను పూర్తిగా సిద్ధం చేసిన తర్వాతే సినిమా ప్రారంభించాలని ఆయన నిర్ణయించుకున్నారు.

అయితే, ‘క్రిష్ 4’ను అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈసారి కథా నేపథ్యం పూర్తిగా అంతరిక్షంలో సాగనుంది. టెక్నికల్‌గా మరింత గ్రాండియర్‌గా సినిమాను రూపొందించబోతున్నారు. ఈ కారణంగా బడ్జెట్ కూడా భారీగా పెరుగుతున్నట్టు రాకేష్ రోషన్ తెలిపారు. అందుకే, నిర్మాణ భాగస్వాముల కోసం మార్గం వెతుకుతున్నట్టు సమాచారం.

తాజా సమాచారం ప్రకారం, ఈ భారీ ప్రాజెక్ట్‌లో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నిర్మాణ భాగస్వాములుగా ప్రవేశించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్‌లో హృతిక్ రోషన్‌తో కలిసి ‘వార్ 2’లో నటిస్తున్నారు. ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్-హృతిక్ మంచి స్నేహితులుగా మారారని తెలుస్తోంది. ఆ స్నేహమే ఇప్పుడు ‘క్రిష్ 4’ నిర్మాణంలో భాగస్వామ్యం తీసుకురావడానికి దారి తీసినట్టు ప్రచారం జరుగుతోంది.

రాకేష్ రోషన్ స్వయంగా హృతిక్ రోషన్ తండ్రి కావడంతో, ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘క్రిష్’ బ్రాండ్ ఇండియన్ సినిమా స్థాయిని పెంచినట్టే, ‘క్రిష్ 4’ మరింత గొప్ప స్థాయిలో తెరకెక్కే అవకాశం ఉంది. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నిజంగా ఈ చిత్ర నిర్మాణంలో భాగం కాబోతున్నారా? అనే విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


Recent Random Post: