
దర్శకుడిగా గౌతమ్ మీనన్‌కు సరైన హిట్ దక్కి చాలా కాలమైంది. చివరగా డైరెక్ట్ చేసిన సినిమానే థియేటర్ల ముఖం చూడలేకపోయింది. దీంతో ప్రస్తుతం నటన వైపుకు మగ్గిపోయారు. స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. మలయాళం, తమిళ పరిశ్రమల్లో ఆయన నటించిన చిత్రాలు వచ్చినా పెద్దగా ప్రచారం పొందడం లేదు.
ఈ నేపథ్యంలో గౌతమ్ మీనన్ స్టార్ హీరో కార్తీ సహాయంతో మళ్లీ డైరెక్షన్లో తిరిగి నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవలే కార్తీకి ఓ కథ వినిపించగా, అది నచ్చడంతో ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఇది గౌతమ్ స్వంత కథ కాదు. ప్రముఖ రచయిత జయమోహన్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించనున్నారు. సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు.
ఒకప్పుడు లవ్ స్టోరీలతో ప్రత్యేకమైన అభిమానాన్ని సొంతం చేసుకున్న గౌతమ్ మీనన్ మళ్లీ తన సత్తా చాటాలంటే విజయం తప్పనిసరి. కార్తీ ఇచ్చిన ఈ అవకాశాన్ని ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటారో చూడాలి. అయితే ప్రస్తుతం కార్తీ చాలా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ‘సర్దార్ 2’ షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలోనే ‘ఖైదీ 2’ సెట్స్‌పైకి వెళ్లనుంది.
అంతేకాక, సముద్ర దొంగల కథ ఆధారంగా ఓ పీరియాడిక్ మూవీ చేయనున్నారు. తమిళ దర్శకుడు దీనికి దర్శకత్వం వహించనున్నారు. అదనంగా ‘కర్ణన్’ ఫేం మారిసెల్వరాజ్ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం కార్తీ షెడ్యూల్ చాలా హెక్టిక్‌గా ఉండటంతో, గౌతమ్ మీనన్ ప్రాజెక్ట్ కోసం ఎప్పుడు డేట్లు కేటాయిస్తాడో చూడాలి.
Recent Random Post:















