నిర్మాతగా నాని ఫుల్ ఫాం – చిరంజీవితో పెద్ద ప్రాజెక్ట్ సిద్ధం!

Share


న్యాచురల్ స్టార్ నాని ఇప్పటికీ హీరోగా తానే కాదు, నిర్మాతగా కూడా తన మార్క్‌ను స్థాపించుకుంటూ ఫామ్‌లో ఉన్నాడు. నాని ప్రొడ్యూస్ చేసే సినిమాలు చిన్న బడ్జెట్‌లో, కంటెంట్ పరంగా బలంగా ఉండటమే కాదు, మంచి కమర్షియల్ సక్సెస్‌ను కూడా అందుకుంటున్నాయి. ఇటీవలే ‘కోర్ట్’ మరియు ‘హిట్ 3’ సినిమాలతో నిర్మాతగా వరుస విజయాలు అందుకున్నాడు.

‘హిట్’ ఫ్రాంచైజీని తనే మొదలుపెట్టి, దాన్ని తన బ్యానర్‌లో విజయవంతంగా కొనసాగిస్తున్నాడు. కోర్ట్ తరువాత హిట్ 3 పెద్ద విజయం సాధించడంతో, ఈసారి హీరో నానికంటే నిర్మాత నానికే లాభాలు ఎక్కువగా వచ్చాయన్న చర్చ ఉంది.

ఇప్పుడు అందరి ఆసక్తి నెక్స్ట్ నాని నిర్మాతగా చేసే సినిమాపైనే. ఎలాంటి కథల్ని వింటున్నాడు? ఎవరి దర్శకత్వంలో చేస్తాడు? అన్నదానిపై ఇండస్ట్రీలో ఊహాగానాలు నడుస్తున్నాయి. హీరోగా మాత్రమే కాకుండా, నిర్మాతగా కూడా తన బ్రాండ్ వెల్యూని బలంగా నిలబెట్టుకుంటున్న నాని, మంచి టేస్ట్ ఉన్న నిర్మాతగా పేరు తెచ్చుకున్నాడు.

కంటెంట్‌కు ప్రాధాన్యత ఇచ్చే నాని, కథను ఒక ఆడియెన్స్‌గా ముందుగా జడ్జ్ చేస్తాడు. అందుకే అతని ఎంపికలు వర్కౌట్ అవుతుంటాయి. ‘అ!’ సినిమాతో ప్రారంభమైన నిర్మాత ప్రయాణం, ఇప్పటికి కోర్ట్, హిట్ 3 వరకు మంచి విజయం సాధించింది.

ఇక త్వరలోనే నాని మెగాస్టార్ చిరంజీవితో కలిసి నిర్మాణంలోకి దిగనున్నాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చిరు నటించే సినిమాను నాని నిర్మించబోతున్నాడు. ఇది నాని కెరీర్‌లో ఒక పెద్ద మైలురాయిగా మారనుంది. అయితే, ఈ ప్రాజెక్ట్ కంటే ముందుగా మరో చిన్న సినిమాను ప్రొడ్యూస్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. కానీ దాని వివరాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు.

నటిగా కూడా నాని ప్రస్తుతం శ్రీకాంత్ డైరెక్షన్‌లో ‘ప్యారడైజ్’ అనే చిత్రంలో నటిస్తుండగా, తదుపరి సుజిత్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు.


Recent Random Post: