
తెలుగు చిత్ర పరిశ్రమకు చేసిన విశేష సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం, నందమూరి బాలకృష్ణకి పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ అవార్డుతో బాలయ్యకు సంబంధించిన శుభవార్తలు ప్రముఖుల నుంచి పోటెత్తాయి. సినీ, రాజకీయ వర్గాల నుండి ఆయనకు అనేక శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
ఇప్పుడు బాలకృష్ణకు ఈ అవార్డు అందుకున్న సందర్భంగా, హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న చంద్రబాబు నాయుడు ఫామ్ హౌస్లో నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో భారీ ఫామిలీ పార్టీ ఏర్పాటయ్యేందుకు సిద్దమవుతోంది. ఈ పార్టీకి నందమూరి ఫ్యామిలీతో పాటు, రెండు కుటుంబాలకు సన్నిహితులైన వారి ఆహ్వానం అందినట్లు సమాచారం.
ఈ వేడుకలో బాలకృష్ణతో కలిసి సినిమా తీసిన దర్శకులు మరియు నిర్మాతలకు కూడా ఆహ్వానాలు పంపించగా, ఇది బాలయ్యకు జరిగే మొదటి భారీ సన్మానం. దీంతో పాటు, టాలీవుడ్ నుంచి కూడా బాలకృష్ణ కోసం ఒక ఘన సన్మాన సభను ఏర్పాటు చేయాలని చర్చ జరుగుతోంది. గతంలో చిరంజీవికి పద్మ అవార్డు వచ్చినప్పుడు కూడా టాలీవుడ్ వారు ఘనంగా సన్మానించారు. ఇప్పుడు అదే విధంగా బాలయ్యకు కూడా సన్మానం చేయడానికి టాలీవుడ్ మంత్రులు ఏర్పాట్లు చేస్తున్నారు.
బాలకృష్ణ సినిమాల విషయానికొస్తే, బాబీ కొల్లి దర్శకత్వంలో డాకు మహారాజ్ చిత్రం సూపర్ హిట్ సాధించిన బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో అఖండ 2 అనే సినిమా తీస్తున్నారు. అఖండ 2 మూవీ సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.
Recent Random Post:















