ప్రమోషన్ లేక మరుగున పడుతున్న మార్గన్

Share


వైవిధ్య‌మైన క‌థ‌ల‌తో, విభిన్న పాత్ర‌ల‌తో ప్రయోగాలు చేసే కోలీవుడ్ మల్టీటాలెంటెడ్ హీరో విజయ్ ఆంటోనీకి తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. అత‌నికి బిచ్చ‌గాడు రూపంలో తెలుగు ఇండస్ట్రీలో గుర్తింపు లభించగా, ఆ క్రేజ్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. నటుడిగా, నిర్మాతగా, సంగీత దర్శకుడిగా బిజీగా ఉన్న విజయ్ ఆంటోనీ తాజాగా మార్గ‌న్: ది బ్లాక్ డెవిల్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

లియో జాన్ పాల్ దర్శకత్వంలో రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదలైంది. తెలుగులో ఏషియన్ సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను రిలీజ్ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని కీలక థియేటర్లలో రిలీజ్ అయినా, అందుకు తగ్గ ప్రమోషన్ లేకపోవడం పెద్ద మైనస్‌గా మారింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించినా, అది కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

ఇది మొదట షోలు నిరాశకు గురిచేసినప్పటికీ, సోషల్ మీడియా ద్వారా సినిమా టాక్ పోజిటివ్‌గా పాకడంతో ఈవెనింగ్ షోల నుంచి ప్రేక్షకుల సంఖ్య పెరిగింది. క్లైమాక్స్ కొంత వైక్ అనిపించినా, స్క్రీన్‌ప్లే, ట్విస్టులు, సూపర్‌న్యాచుర‌ల్ ఎలిమెంట్స్ సినిమాకు మంచి థ్రిల్ అందించాయి. కానీ ప్రమోషన్లలో జోష్ లేకపోవడంతో వసూళ్లపై ప్రభావం పడింది.

తమిళనాట మాత్రం విజయ్ ఆంటోనీ స్వయంగా రంగంలోకి దిగి మీడియా ఇంటర్వ్యూలు, ఫ్యాన్స్ మీట్స్ ద్వారా ప్రమోషన్ జోరుగా చేస్తున్నారు. అందుకే అక్కడ బజ్ బాగా క్రియేట్ అయ్యింది. అయితే తెలుగు వెర్షన్‌కు ఇదే అనుసరించకపోవడం తప్పుడు నిర్ణయంగా మారింది.

ఇక విజయ్ ఆంటోనీకి బిచ్చ‌గాడు తర్వాత భారీ హిట్ దక్కి చాలా కాలమే అయింది. బిచ్చగాడు 2తో సరే అనిపించినా, తర్వాతి సినిమాలు ఫ్లాపే అయ్యాయి. ఇప్పుడు మార్గ‌న్ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నా, సరైన ప్రమోషన్ లేకపోవడం వల్ల చిత్రం అర్ధాంతరంగా నిలిచే ప్రమాదం కనిపిస్తోంది. మరి మేకర్స్ తక్షణమే ప్రమోషన్‌పై దృష్టి పెడతారో లేదో చూడాలి.


Recent Random Post: