ప్రభాస్-కంగనా రనౌత్ పెద్ద స్టార్లు కాక ముందు జంటగా ‘ఏక్ నిరంజన్’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. పూరి జగన్నాధ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అప్పటికే కంగన బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసింది. అయితే గుర్తింపు మాత్రం రాలేదు. ఇదే సమయంలో పూరి ఛాన్స్ ఇవ్వడంతో ఇక్కడా అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఇక ప్రభాస్ కూడా అప్పుడే హీరోగా ఎదుగుతున్నాడు. ఆ క్రమంలోనే ఈ త్రయంలో ‘ఏక్ నిరంజన్’ పట్టా లెక్కింది. కానీ ఈ సినిమా ఆశించిన ఫలితాలు సాధించలేదు అనుకోండి.
ఆ తర్వాత కంగన మళ్లీ యధా విధిగా బాలీవుడ్ లో బిజీ అయింది. అయితే ఈసారి ఎవరూ టచ్ చేయని రేంజ్ కే చేరుకుంది. వరుస విజయాలతో అగ్ర హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. అమ్మడు ఇప్పుడు ఏకంగా లేడీ ఓరియేంటెడ్ నాయికగానే సత్తా చాటుతుంది. సింగిల్ గానే వందల కోట్లు వసూళ్లు సాధించే స్థాయికి చేరుకుంది. బాలీవుడ్ స్టార్ హీరోలకే సవాల్ విసిరే స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం దర్శక-నిర్మాతగానూ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే.
ఇక ప్రభాస్ క్రేజ్ ‘బాహుబలి’ విజయంతో ఏ స్థాయికి చేరిందో తెలిసిందే. పాన్ ఇండియాని దాటి పాన్ వరల్డ్ నే షేక్ చేసాడు. అక్కడ నుంచి డార్లింగ్ ఏ సినిమా చేసినా అది పాన్ ఇండియా తప్ప! మరో సినిమా చేయడం లేదన్న విషయం తెలిసిందే. ఇప్పుడాయన ఏ సినిమా చేసిన వందల కోట్లు పెట్టుబడితో కూడుకున్న పని. ఆరకంగా బాలీవుడ్ హీరోల రేంజ్‌నే దాటిపోయాడు. మరి అతడి ఎదుగుదల పట్ల ఒకప్పటి సహనటి కంగన మనసులో ఏమనుకుంటుందో? తాజాగా బయటకొచ్చింది.
‘చంద్రముఖి -2’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మీడియా ఇంటరాక్షన్ లో ఆసక్తికర విషయాలు పంచుకుంది. ప్రభాస్ తో మళ్లీ ఏక్ నిరంజన్ -2 లో నటించే ఛాన్స్ వస్తే చేస్తారా? అంటే తప్పకుండా అంది. ఇద్దరం ఏక్ నిరంజన్ లో నటించాం. ఆ సినిమా ఎక్స్ పీరియన్స్ గురించి చెప్పుకొచ్చింది. అలాగే ఇప్పుడు ప్రభాస్ పెద్ద స్టార్ అయినందుకు..ఎదుగుదల చూసి తాను ఎంతో సంతోషంగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది.
Recent Random Post: