
వారణాసి విడుదలకు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉన్నప్పటికీ, రాజమౌళి ఇప్పటి నుంచే రెగ్యులర్ ప్రమోషన్ మోడ్‌లోకి వెళ్లడం వెనుక పక్కా ప్లానింగ్, మైండ్ గేమ్ ఉందని స్పష్టంగా కనిపిస్తోంది. బాహుబలిని చైనాలో, ఈగను జపాన్‌లో ముందుగానే పరిచయం చేసి, తనకంటూ ఒక గ్లోబల్ బ్రాండ్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న జక్కన్న, ఆ వ్యూహాన్ని మరింత అడ్వాన్స్డ్ స్థాయికి తీసుకెళ్లారు. ఆర్ఆర్ఆర్లోని ‘నాటు నాటు’ ఆస్కార్ గెలవడం ఒక మైలురాయి అయితే, నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులతో గట్టిగా కనెక్ట్ కావడం మరో కీలక అడుగు.
ఇప్పుడు వారణాసి విషయంలో రాజమౌళి స్ట్రాటజీ నెక్స్ట్ లెవల్లో ఉంది. గత చిత్రాలతో తన టాలెంట్‌ను ప్రపంచానికి చాటి చెప్పిన ఆయన, ఈసారి సినిమా రిలీజ్ అయిన తర్వాత హాలీవుడ్ దృష్టిని ఆకర్షించడం కాదు, రిలీజ్ రోజే వరల్డ్‌వైడ్ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. అందుకే కొలైడర్ వంటి అంతర్జాతీయ మీడియా వేదికలపై ఇప్పటి నుంచే బజ్ క్రియేట్ చేస్తున్నారు.
ఒక విధంగా చెప్పాలంటే, రాజమౌళి ఇప్పుడు హాలీవుడ్ ఆడియన్స్‌కు మరింత దగ్గరవుతున్నారు. మన దేశపు కథలను విదేశీయులకు అర్థమయ్యే టెక్నికల్ స్టాండర్డ్స్‌లో ప్రెజెంట్ చేయడమే ఆయన స్పెషాలిటీ. ఐమాక్స్ షూటింగ్, రియల్ విజువల్స్, భారీ యాక్షన్ సెక్వెన్సుల గురించి రాజమౌళితో పాటు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, మహేష్ బాబు మాట్లాడుతున్న తీరు వెస్ట్రన్ ఆడియన్స్‌లో క్యూరియాసిటీని పెంచుతోంది.
మహేష్ బాబును ఒక గ్లోబల్ హీరోగా పరిచయం చేస్తూనే, ఇండియన్ మైథాలజీ ఆత్మను యాక్షన్ అడ్వెంచర్ కథతో మేళవించడం జక్కన్న స్టైల్‌కు మరో ఉదాహరణ. ఈగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్తో సృష్టించిన ఇంపాక్ట్ ఇప్పుడు వారణాసికి భారీ ప్లస్‌గా మారనుంది.
హాలీవుడ్ స్థాయి యాక్షన్ సినిమాలు చూసే ప్రేక్షకులకు వారణాసి ఒకేసారి లోకల్ ఫ్లేవర్‌తో కూడిన గ్లోబల్ ట్రీట్‌లా అనిపించబోతుంది. రిలీజ్ రోజునే ప్రపంచవ్యాప్తంగా భారీ ఓపెనింగ్స్ రాబట్టి, ఒక ఇండియన్ సినిమా హాలీవుడ్ మూవీస్ రికార్డులకు సైతం సవాల్ చేయాలన్నదే రాజమౌళి లక్ష్యంగా కనిపిస్తోంది. అలాగే బిజినెస్ పరంగా కూడా వారణాసి గ్లోబల్ మార్కెట్లో అప్పర్ హ్యాండ్ క్రియేట్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తానికి జక్కన్న ఈ సినిమా కోసం పక్కా గ్రౌండ్ వర్క్ సిద్ధం చేస్తున్నాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు మిగిలిందంతా నెక్స్ట్ అప్డేట్స్ ఏ స్థాయిలో ఉండబోతున్నాయో చూడడమే.
Recent Random Post:















