శివ కార్తికేయన్ వరుస క్రేజీ సినిమాలతో దూసుకెళ్తున్నాడు!

Share


కోలీవుడ్‌ స్టార్ హీరోగా శివ కార్తికేయన్ దూసుకెళ్తున్నాడు. వరుస హిట్లతో తన మార్కెట్‌ను పెంచుకుంటూ, ప్రేక్షకుల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటున్నాడు. మంచి కథలు, కొత్త కాంబినేషన్లతో ఆయన ఎంచుకుంటున్న సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద అదిరిపోయే విజయాలను నమోదు చేస్తున్నాయి. ఇదే జోష్‌లో శివ కార్తికేయన్ వరుసగా క్రేజీ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటూ ఫ్యూచర్‌కు బలమైన ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నాడు.

ప్రస్తుతం శివ కార్తికేయన్, సుధ కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతున్న పరాశక్తి అనే పీరియాడికల్ స్టూడెంట్ డ్రామాలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో జయం రవి ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడు. 2026 సంక్రాంతికి ఈ సినిమా విడుదల కావొచ్చని సమాచారం. మరోవైపు, ప్రముఖ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో మదరాసి అనే మాస్ ఎంటర్‌టైనర్‌ చేస్తుండగా, ఇది ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సంవత్సరం మదరాసి థియేటర్లకు రానుందని తెలుస్తోంది.

ఇంతకే పరిమితమయ్యాడా అంటే లేదు. గుడ్ నైట్ సినిమాతో గుర్తింపు పొందిన దర్శకుడు వినాయక్ చంద్రశేఖరన్ డైరెక్షన్‌లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు శివ కార్తికేయన్. ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో మలయాళ లెజెండ్ మోహన్‌లాల్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. మొదట ఈ సినిమా ముందే ప్రారంభించాలని భావించినా, మోహన్‌లాల్ డేట్స్ అందుబాటులో లేకపోవడంతో ప్రాజెక్ట్‌ను కొంత ఆలస్యంగా ప్రారంభించనున్నారు.

ఈ గ్యాప్‌లో శివ కార్తికేయన్ మరో క్రేజీ కాంబినేషన్‌ను లాక్ చేశాడు. కోలీవుడ్ టాప్ డైరెక్టర్ వెంకట్ ప్రభుతో కలిసి ఓ సినిమా చేయబోతున్నాడు. సూర్య, విక్రం, విజయ్ లాంటి స్టార్ హీరోలతో పనిచేసిన వెంకట్ ప్రభు, ఈసారి శివ కార్తికేయన్‌తో తన యూనిక్ స్టైల్‌లో సినిమా రూపొందించనున్నాడు. వెంకట్ ప్రభు సినిమాలు తరచూ విభిన్నంగా, సరికొత్త కథలతో ఉంటాయి. ఇటీవల ఆయన ఫామ్‌లో లేకపోయినా, శివ కార్తికేయన్ ఫుల్ ఫామ్‌లో ఉన్నందున ఈ కాంబోపై మంచి అంచనాలే ఉన్నాయి.

ఈ సినిమాతో శివ కార్తికేయన్ తన క్రేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లే అవకాశముందని ట్రేడ్ వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. అయితే వెంకట్ ప్రభు సినిమా కథపై మాత్రం ఇప్పటివరకు ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. మరి ఈ కాంబినేషన్ నుంచి ఎలా సినిమా వస్తుందో చూడాలి!


Recent Random Post: