
ఒక్క సమయంలో తన నటనతో దక్షిణాది సినిమా పరిశ్రమలో అగ్రస్థానాన్ని దక్కించుకున్న వారిలో ఖుష్బూ కూడా ఒకరు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అనేక హిట్ చిత్రాల్లో నటించి విశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.
ప్రస్తుతం ఖుష్బూ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు నిర్మాతగా, రాజకీయ నేతగా తన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తోంది. తెలుగుతో పాటు తమిళనాట కూడా ఆమెకు మంచి క్రేజ్ ఉంది. అక్కడి అభిమానులు ఖుష్బూ కోసం గుడి కూడా కట్టారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. *భారతీయ జనతా పార్టీ (బీజేపీ)*లో సీనియర్ నేతగా కొనసాగుతున్న ఆమె, సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ వార్తల్లో నిలుస్తోంది.
‘కలియుగ పాండవులు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఖుష్బూ, ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రస్తుతం మహిళా ప్రాధాన్యత గల సినిమాలు తక్కువగా వస్తున్నాయని, అరణ్మనై 4, మూకుతి అమ్మన్ 2 లాంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు క్రమంగా పెరిగినా, ఇప్పటికీ హీరోల ఆధిపత్యమే ఎక్కువగా కనిపిస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు.
రజినీకాంత్, కమల్ హాసన్, ఆమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ లాంటి స్టార్ హీరోల ప్రభావం ఇప్పటికీ సినీ పరిశ్రమలో స్పష్టంగా కనిపిస్తోందని ఖుష్బూ వ్యాఖ్యానించారు. అయితే, డిజిటల్ యుగంలో ఓటీటీ ప్లాట్‌ఫారాలు మహిళా నటీమణులకు తమ టాలెంట్‌ను ప్రదర్శించడానికి గొప్ప వేదికగా మారాయని, కానీ అందుకు తగినంత అవకాశాలను వారు ఉపయోగించుకోవడం లేదని వ్యాఖ్యానించారు.
ఖుష్బూ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీలో మార్పు రావాలంటే మహిళా ప్రాధాన్యత గల సినిమాలను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Recent Random Post:















