హరిహర వీరమల్లు వాయిదాల కలకలం

Share


పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా ప్రకటించి ఆరేళ్లు కావస్తోంది. ఈ సినిమా ప్రారంభంలో, విడుదలైన టీజర్‌తో భారీ హైప్‌ క్రియేట్ అయింది. పవన్ కళ్యాణ్ శక్తిని పూర్తిగా వినియోగిస్తారనే నమ్మకంతో, ఇది పాన్ ఇండియా సెన్సేషన్ అవుతుందని అందరూ ఆశించారు. కానీ కరోనా, ఇతర అనుకోని కారణాలతో సినిమా పదే పదే ఆలస్యమవుతూ వచ్చింది.

ప్రారంభంలో దర్శకుడు క్రిష్‌కి ఉన్న ప్రాజెక్ట్‌ ఇప్పుడు ఆయన నుండి జ్యోతికృష్ణకు బదిలైంది. అయినప్పటికీ, షూటింగ్ జాప్యం పూర్తిగా ఆగలేదు. తుదకు ఇటీవలే షూటింగ్ ముగిసినప్పటికీ, రిలీజ్ తేదీపై స్పష్టత లేకపోవడం అభిమానులను నిరాశపరుస్తోంది. జూన్ 12న రిలీజ్ చేస్తారనుకున్నా, అది కూడా వాయిదా పడింది. కొత్త విడుదల తేదీ ఇప్పటికీ ప్రకటించలేదు.

ఈ వాయిదాకు రెండు ప్రధాన కారణాలు చెప్పబడుతున్నాయి – పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడం, మరియు థియేట్రికల్ బిజినెస్ ఇంకా ఫైనలైజ్ కాకపోవడం. ముఖ్యంగా, బడ్జెట్ పెరగడం, దర్శకుడి మార్పు వంటి అంశాలతో బయ్యర్లకు కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది. అయితే నిర్మాతలు మాత్రం సినిమా కోసం అడుగుతున్న రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా క్రేజ్ ఉన్న ‘ఓజీ’ కంటే ఎక్కువ ధర చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

పవన్ కళ్యాణ్ సినిమా అయినా, బయ్యర్లు ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువ పెట్టుబడి పెట్టేందుకు వెనుకాడుతున్నారు. అయితే నిర్మాతలు పెట్టుబడి తిరిగి రావాలనే దృక్పథంలో ఉంటున్నారు. కానీ లేటుగా వస్తే, క్రేజ్ తగ్గిపోయే అవకాశం ఎక్కువ. ఇప్పటికైనా వాస్తవ పరిస్థితులను గుర్తించి, రీజనబుల్ రేట్లకు సినిమాను విడుదల చేయడం మేలుగా భావిస్తున్నారు పరిశ్రమ వర్గాలు.


Recent Random Post: