అఖండ 2 టీజర్‌పై గోపీచంద్ మలినేని రివ్యూ వైరల్

Share


నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వ‌రుస క్రేజీ ప్రాజెక్టులతో ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. ‘అఖండ’ బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత బాలయ్య మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘డాకు మహారాజ్’ తర్వాత ఆయన త్వ‌ర‌లోనే మరో మాస్ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అదే ‘అఖండ 2’.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పైనే ఇప్పుడు భారీ అంచనాలు నెలకొన్నాయి. అఖండ సీక్వెల్‌గా వస్తుండటంతో బాలయ్య అభిమానుల్లో భారీ ఉత్కంఠ నెలకొంది. ఈ సినిమాను బాలయ్య చిన్న కుమార్తె తేజస్వీ నందమూరి నిర్మిస్తున్నారు, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంటతో కలిసి. సంయుక్తా మీనన్ కీలక పాత్రలో నటిస్తుండగా, ఆది పినిశెట్టి పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించనున్నాడు. ప్రస్తుతం సినిమా షూటింగ్ తుది దశలో ఉంది, సెప్టెంబర్‌లో గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.


ఇక బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా జూన్ 10న ‘అఖండ 2’ టీజర్‌ ను విడుదల చేయనున్నారు. అభిమానులు టీజర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, దర్శకుడు గోపీచంద్ మలినేని చేసిన ఒక ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తమన్ సంగీతంపై స్పందించిన మలినేని –
“ఇప్పుడే అఖండ 2 టీజర్ చూశాను. ఇది కేవలం పవర్‌ఫుల్‌గా లేదు… It’s pure rage… దైవత్వం నిండిన రౌద్రం! తమన్ బీజీఎమ్ ఓ తాండవంలా ఉంది. ఒకే ఒక్క షాట్ నాకు గూస్‌బంప్స్ ఇచ్చింది. ఆ ఫీల్ ఇప్పటికీ నా లోపల గుచ్చుకున్నట్టుంది. NBK & బోయపాటి విధ్వంసం… జై బాలయ్య!” అని ట్వీట్ చేశారు.

ఈ రివ్యూ ప్రేక్షకుల్లో టీజర్ పైన మించి ఆసక్తిని రేకెత్తిస్తోంది. జూన్ 10న టీజర్ విడుదల కాకముందే హైప్ అంతగా పెరిగిన వేళ, ఇది సినిమా స్థాయిని మరో మెట్టుకు తీసుకెళ్తుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.


Recent Random Post: