అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబి నిర్మాతగా ‘గని’ సినిమాతో పరిశ్రమలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. బాక్సింగ్ నేపథ్యంతో భారీ ఎత్తున తెరకెక్కిన ఆ సినిమా అంచనాల మేర ఫలితాన్ని అందించలేకపోయింది. అప్పటి నుంచి బాబి మరో ప్రాజెక్ట్ ప్రకటించకుండా చాలా కామ్ గానే ఉన్నారు. అయితే ఇప్పుడు ఆయన బాలీవుడ్‌లో బిజినెస్ చేయాలని డిసైడ్ అయినట్టు సమాచారం.
తాజా సమాచారం ప్రకారం, అల్లు బాబి ముంబైలో ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి అక్కడే సొంత బ్యానర్‌తో సినిమాలు నిర్మించేందుకు సీరియస్‌గా ప్లాన్ చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్‌తో కలిసి పనులు చేసే ప్రయత్నంలో ఉన్నారని కూడా టాక్. డిస్ట్రిబ్యూషన్ రంగంలోనూ పట్టు సాధించాలన్న ఉద్దేశంతో ముంబైకి ఫోకస్ చేస్తున్నట్లు సమాచారం.
అయితే ఈ సడన్ మార్పు వెనుక అల్లు అరవింద్ సెక్రెట్ ప్లాన్ ఉందంటూ పరిశ్రమలో చర్చలు జరుగుతున్నాయి. పుష్పతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన అల్లు అర్జున్‌కు బాలీవుడ్‌లో మరింత స్ట్రాంగ్ మార్కెట్ ఏర్పాటుచేయాలనే వ్యూహంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారట. ఒక మంచి సినిమాకు కంటెంట్ ఉంటే సరిపోదు – దాన్ని ప్రేక్షకులకు చక్కగా రీచ్ అయ్యేలా చేయాలంటే ముంబై మార్కెట్‌లో బలమైన నెట్‌వర్క్ ఉండాలి. అందుకే బాబిని అరవింద్ ముంబైకి పంపారని అంటున్నారు.
వెనుకబడిన వ్యవస్థలపై ఆధారపడకుండా సొంత బ్యానర్, సొంత డిస్ట్రిబ్యూషన్ ద్వారా సినిమాలు రిలీజ్ చేస్తే లాభాలు ఎక్కువగా వస్తాయని అల్లుఅరవింద్ అంచనా. ఈ ప్రయత్నం బన్నీ పాన్ ఇండియా స్టార్‌డమ్‌ను మరింత బలపరిచే దిశగా ఉండొచ్చు. నిజంగా బాబి బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారా? లేదా ఇదంతా కేవలం ప్రచారమేనా? అన్నది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
Recent Random Post: