ఓటీటీలోకి కాదు… థియేటర్‌కే మొదటి అడుగు!

Share


ఇది ఓటీటీ యుగంలోనే థియేటర్ పునర్జన్మకు నాంది పలికేలా ఉంది. బాలీవుడ్‌ స్టార్‌ అమీర్ ఖాన్ తీసుకున్న తాజా నిర్ణయం పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీస్తోంది. అతను హీరోగా నటించిన సితారే జమీన్ పర్ చిత్రాన్ని ఓటీటీకి అమ్మకుండా ముందుగా థియేటర్లలో విడుదల చేసి, అనంతరం యూట్యూబ్‌లో పేపర్ వ్యూ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించారు.

ఇది ఓటీటీ వల్ల జరుగుతున్న నష్టాలను అంచనా వేసి తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయం. ఈ తరహా మోడల్‌లో నిర్మాతకు ప్రారంభంలో కొంత నష్టం రావొచ్చు కానీ, థియేటర్ల పట్ల ప్రేక్షకుల నమ్మకాన్ని తిరిగి కలిగించేందుకు ఇది బలమైన ప్రయత్నంగా నిలవనుంది.

ఇప్పటివరకు సినిమా హిట్ అయితే కొన్ని వారాలు గడిపి ఓటీటీలో విడుదల చేసేవారు. కానీ ఫెయిల్ అయితే వారం రోజుల్లోనే ఓటీటీలోకి వెళ్ళిపోతుంది. ఇది చిన్న సినిమాలకు మరింత నష్టం తెస్తోంది. ప్రేక్షకులు థియేటర్‌కు రావడం ఆపారు. ఈ క్రమంలో ఓటీటీలు కూడా థియేటర్ రిలీజ్ ప్యాటర్న్‌పై ప్రభావం చూపుతున్నాయి. పెద్ద సినిమాలకు ఒక విధంగా, చిన్న సినిమాలకు మరో విధంగా ట్రీట్‌మెంట్ ఇస్తున్నాయి.

ఈ పరిస్థితుల్లో ఓటీటీ వ్యవస్థపై ప్రశ్నలు వేయడం చాలా కొద్దిమంది మాత్రమే చేస్తున్నా, అమీర్ ఖాన్‌ ఓ తార్కిక వ్యూహంతో ముందుకు వస్తున్నారు. స్వేచ్ఛను నిలుపుకోవాలంటే, ప్రేక్షకుడిని థియేటర్‌కి తిరిగి తీసుకురావాలంటే, నిర్మాతలు కూడా అమీర్ లాగే ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి. ప్రస్తుతానికి కొంత నష్టాన్ని భరించాల్సి వచ్చినా, దీర్ఘకాలంలో థియేటర్ కల్చర్‌ను బ్రతికించాలంటే ఇదే సరైన మార్గం అని అర్థమవుతోంది.


Recent Random Post: