సూర్య కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మితమైన కంగువా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిన విషయం తెలిసిందే. అయితే, హీరో సూర్య ఈ విషయంపై స్పందించకపోయినా, ఆయన భార్య, ప్రముఖ నటి జ్యోతిక మాత్రం ఈ ఫలితాన్ని పాజిటివ్‌గా చూసే ప్రయత్నం చేస్తున్నారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో జ్యోతిక మాట్లాడుతూ, కంగువా కు అన్యాయంగా కఠినమైన రివ్యూలు వచ్చాయనీ, మామూలు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్లుగా నిలుస్తున్న సందర్భాల్లో కంగువా కంటే చాలా దారుణమైన చిత్రాలు హిట్ అయినట్లు తెలిపారు. అయితే, టీమ్ ఎంతో శ్రమ పెట్టిన ఈ సినిమాపై అలా వ్యతిరేకంగా స్పందించడం బాధించిందని ఆమె అన్నారు.
కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే, ఎంత కష్టపడ్డా, ఎంత ఖర్చు పెట్టినా, ప్రేక్షకుడిని థియేటర్లకు రప్పించేది కేవలం మంచి కంటెంట్ మాత్రమే. రివ్యూలు ఎలా ఉన్నా, సినిమా బాగా ఉంటే ప్రేక్షకులు దాన్ని ఆదరిస్తారు. కంగువా లాగే గేమ్ ఛేంజర్, ఇండియన్ 2 వంటి పాన్ ఇండియా సినిమాలు కూడా భారీ అంచనాల మధ్య విడుదలై అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. అయితే, వాటి నిర్మాతలు, దర్శకులు ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా, ఫలితాన్ని స్వీకరించి మౌనంగా ఉన్నారు.
సినిమా ఫలితాన్ని స్వీకరించి, పొరపాట్లు ఎక్కడ జరిగాయో విశ్లేషించుకుంటే భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా ఉండొచ్చు. భారీ బడ్జెట్, హైప్ కంటే, ప్రేక్షకుల డబ్బుకు న్యాయం చేసే కథా కథనాలే కీలకం. ఇక సూర్య తదుపరి చిత్రం రెట్రో మే 1న విడుదల కానుంది. ఈ సినిమా ఏ స్థాయిలో నిలుస్తుందో చూడాలి.
Recent Random Post: