తమిళ సినీ ఇండస్ట్రీలో తలపతి విజయ్ ఎప్పుడూ కొత్త ప్రయోగాలకు వెళ్తూ తన సినిమాలకు విశేషమైన ప్రత్యేకతను తీసుకువస్తాడు. అయితే, ఇప్పుడు ఆయన చేస్తున్న “జయ నాయకన్” సినిమా కేవలం కమర్షియల్ లెవెల్‌కే పరిమితం కాకుండా, రాజకీయంగా కూడా కీలకంగా మారే అవకాశం ఉంది. విజయ్ ఇప్పటికే రాజకీయ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, ఈ సినిమా ఆయన సినీ కెరీర్‌కు గౌరవప్రదమైన మైలురాయిగా నిలవాలని ప్లాన్ చేస్తున్నారు.
ఈ చిత్రాన్ని హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు. సినిమా కథ విషయానికి వస్తే, ఇది నందమూరి బాలకృష్ణ నటించిన “భగవంత్ కేసరి” సినిమాకు ప్రేరణగా రూపొందినట్లు సమాచారం. విజయ్ మునుపటి చిత్రాలు మాస్ ఎలిమెంట్స్‌తో ఉండగా, ఈసారి ఆయన ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో నటించడం ఆసక్తికరంగా మారింది.
సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా, బాబీ డియోల్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, గౌతమ్ వాసుదేవ్ మీనన్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అయితే, ఇప్పుడు ఈ సినిమాపై మరో ఆసక్తికరమైన గాసిప్ వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో వస్తున్న రూమర్ ప్రకారం, జయ నాయకన్ చిత్రంలో ప్రముఖ దర్శకులు లోకేష్ కనగరాజ్, అట్లీ, నెల్సన్ దిలీప్ కుమార్ ప్రత్యేక అతిథి పాత్రల్లో కనిపించనున్నారని టాక్. వీరు విజయ్ కెరీర్‌లో కీలకమైన హిట్ సినిమాలు అందించిన దర్శకులు. “మాస్టర్, లియో, మెర్సల్, బిగిల్, బీస్ట్” వంటి విజయవంతమైన చిత్రాల ద్వారా విజయ్ స్టార్‌డమ్ మరింత పెరిగింది.
ఇప్పుడు ఈ ముగ్గురు దర్శకులు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే, అది తలపతి అభిమానులకు పెద్ద ట్రీట్ కానుంది. అయితే, ఈ గెస్ట్ అప్పీరెన్స్ కథ కోసమేనా లేదా కేవలం సినిమాకు ప్రమోషనల్ ఎలిమెంట్‌గా ఉంచుతున్నారా అన్నది స్పష్టత రావాల్సి ఉంది.
ఈ సినిమా విజయ్ రాజకీయ ప్రవేశానికి ఓ గ్రాండ్ సెండాఫ్ ఇవ్వాలనే ఉద్దేశంతో రూపొందుతోందన్న టాక్ ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. తమిళ సినీ ఇండస్ట్రీలో విజయ్ స్టార్‌గా నిలిచినా, ఇప్పుడు రాజకీయంగా కొత్త దశలోకి అడుగుపెట్టనున్న నేపథ్యంలో, సినిమా పరిశ్రమలో ఆయన సన్నిహితులు ఈ ప్రాజెక్టును ప్రత్యేకంగా మలచాలని చూస్తున్నారని సమాచారం.
మ్యూజిక్ విషయానికి వస్తే, అనిరుధ్ రవిచందర్ మరోసారి తన స్టైల్ చూపించబోతున్నాడు. గతంలో విజయ్‌కి “కత్తి, మాస్టర్, లియో” వంటి సూపర్ హిట్స్ అందించిన అనిరుధ్, ఇప్పుడు జయ నాయకన్ కోసం మరో పవర్‌ఫుల్ ఆల్బమ్ అందిస్తున్నట్లు సమాచారం.
ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తలపతి విజయ్ కెరీర్‌లో “జయ నాయకన్” ఎంత పెద్ద విజయాన్ని అందుకుంటుందో, ఈ చిత్రం రాజకీయంగానూ ఎంతటి ప్రభావం చూపుతుందో చూడాలి.
Recent Random Post: